మూడునెలల తర్వాత: కశ్మీర్‌లో రైళ్ల పునరుద్ధరణ.. తొలుత లిమిటెడ్ ట్రైన్స్...
ఎట్టకేలకు కశ్మీర్‌లో రైలు సేవలను పునరుద్ధరించాలని కేంద్రం నిర్ణయిచింది. అయితే కొన్ని రూట్లలో రేపటి నుంచి సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఆగస్ట్ 5వ తేదీన జమ్ముకశ్మీర్‌కు ఉన్న ప్రత్యేక ప్రతిపత్తిని కేంద్ర ప్రభుత్వం రద్దుచేసిన సంగతి తెలిసిందే. జమ్ముకశ్మీర్, లడాఖ్‌ను కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించింది. అప్పటినుంచి కశ్మీర్ లోయలో ఆంక్షలు కొనసాగుతూనే ఉన్నాయి.
కశ్మీర్ విభజన తర్వాత సీఆర్పీఎఫ్ బలగాల ఆధీనంలో లోయ ఉన్నది. దీంతో ఆంక్షలు కొనసాగాయి. ఇంటర్నెట్ సేవలపై కూడా ఆంక్షలు విధించారు. ఫోన్లు మూగబోయాయి. క్రమక్రమంగా స్కూళ్లు, కాలేజీలు తెరుచుకున్నాయి. ప్రభుత్వ కార్యాలయాలను ఒపెన్ చేశారు. తర్వాత ఫోన్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. మంగళవారం నుంచి రైలు సేవలను యదావిధిగా అందుబాటులో ఉంచుతాయి. ఈ మేరకు ఉత్తర రైల్వే విభాగం సమాచారం అందజేసింది.

కశ్మీర్‌లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు రైళ్ల సేవలు కొనసాగుతాయని రైల్వే అధికారులు పేర్కొన్నారు. శ్రీనగర్-బారాముల్లా-శ్రీనగర్ మధ్య కొద్దిమంది ప్రయాణికులతో రెండు సర్వీసులను నడుపుతామని తెలిపారు.
కశ్మీర్ లోయలో రైళ్ల సేవలను పునరుద్ధరించే ముందు తనిఖీలు చేపట్టారు. రైల్వే ట్రాక్‌ను ఈ నెల 10 నుంచి చెక్ చేశారు. అంతా బాగానే ఉందని నిర్ధారించుకున్నాక ట్రయల్ కూడా చేశారు. ఆగస్ట్ 5వ తేదీ నుంచి బారాముల్లా నుంచి బనిహల్‌కు రైలు సేవలను నిలిపివేసిన సంగతి తెలిసిందే.
-
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
రైతు భరోసాపై మరో శుభవార్త చెప్పిన తెలంగాణా ప్రభుత్వం.. త్వరపడండి! -
ఉచిత బస్సు పథకంలో ఇక కొత్తగా, నేటి నుంచి పాస్ ల జారీ- మార్గదర్శకాలు..!! -
తెలంగాణ స్టైల్ 'పచ్చి పులుసు'.. జస్ట్ 10 నిమిషాల్లోనే రెడీ..! -
రంజాన్ కానుక: పండుగ వేళ భారీగా నిధుల విడుదల -
సిలిండర్ పొందాలంటే ఇక తప్పని సరిగా.. ప్రభుత్వం తాజా ఆదేశాలు..!! -
ఏపీలో ఆస్తిపన్ను చెల్లింపుదారులకు గుడ్ న్యూస్-బంపర్ ఆఫర్..! -
వాస్తు ప్రకారం గుప్పెడు బియ్యంతో మీ అదృష్టాన్ని మార్చుకోవచ్చు -
Gas మాఫియాపై ఊహించని రైడ్స్, భారీగా పట్టుబడ్డ గ్యాస్ సిలిండర్లు!












Click it and Unblock the Notifications