నాగపూర్లో కన్నయ్యకు చేదు, చెప్పు విసిరిన దళ్ కార్యకర్త
నాగపూర్: ఢిల్లీ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజీ విశ్వవిద్యాలయ (జెఎన్‌యూ) విద్యార్థి కన్నయ్య కుమార్‌కు నాగపూర్‌లో గురువారం నాడు చేదు అనుభవం ఎదురైంది. ఓ సమావేశ మందిరంలో ఆయన పైకి బజరంగ్ దళ్ కార్యకర్త ఒకరు చెప్పు విసిరారు.
కన్నయ్య కుమార్ గురువారం నాగపూర్లో పర్యటించారు. ఓ సభలో మాట్లాడారు. ఈ సందర్భంగా బజరంగ్ దళ్ కార్యకర్తలు ఆయన పైకి చెప్పు విసిరారు. ఈ సందర్భంగా సభలో గందరగోళం నెలకొంది. దీంతో బజరంగ్ దళ్, ఏబీవీపీ కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

కన్నయ్య మాట్లాడుతూ... తన పైన చెప్పు విసిరిన వ్యక్తి చెప్పులు పోగొట్టుకున్నాడని ఎద్దేవా చేశాడు. ఆ చెప్పును చూపిస్తూ ఆయన మాట్లాడాడు. ఎండలు బాగా మండిపోతున్నాయని, ఇలా తన పైన చెప్పులు విసిరి బయటకు వెళ్తే మీ కాళ్లు మండుతాయని చెప్పాడు.
తన పైన ద్వేషం పెంచుకున్నా ఫరవాలేదు కానీ మీ కాళ్లు కాలకుండా చూసుకోవాలని వ్యాఖ్యానించాడు. తన మీద ప్రేమతో చెప్పులు పోగొట్టుకోవద్దన్నాడు. అంతకుముందు అతని కాన్వాయ్ పైన కొందరు రాళ్లు రువ్వారు. తాను ఇలాంటి బెదిరింపులకు భయపడనని చెప్పారు.












Click it and Unblock the Notifications