ట్రాన్స్ జెండర్లకు శుభవార్త: పాన్‌కార్డులో కొత్త ఆఫ్షన్
న్యూఢిల్లీ: ఆధార్- పాన్ అనుసంధానంలో ట్రాన్స్‌జెండర్ల సమస్యకు పరిష్కారం లభించింది. పాన్‌కార్డులో థర్డ్‌జెండర్ ఆఫ్షన్ కల్పిస్తూ ప్రత్యక్ష పన్నుల కేంద్ర బోర్డు సోమవారం నాడు నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఆదాయపు పన్ను శాఖ జారీ చేసే పాన్‌కార్డు ధరఖాస్తులో ట్రాన్స్ జెండర్లను ప్రత్యేక కేటగిరీగా గుర్తించిన కేంద్రం వారికోసం ఈ ప్రత్యేక ఆప్షన్‌ను కేటాయించింది. స్త్రీ, పురుషుల మాదిరిగా ట్రాన్స్‌జెండర్లకు ఓ ఆప్షన్‌ను కేటాయిస్తూ ఆదాయ పన్ను శాఖ నిబంధనలను ప్రభుత్వం సవరించింది. దీనికి సంబంధించిన నోటిఫికేషన్‌ను సీబీడీటీ సోమవారం విడుదల చేసింది.

ఆధార్‌తో పాన్ అనుసంధానం సమయంలో ట్రాన్స్ జెండర్లు ఎదుర్కొంటున్న సమస్యను అధికారుల దృష్టికి తీసుకొచ్చారు.అయితే ఈ సమస్యను పరిష్కరిస్తున్నట్టుగా సీబీడీటీ సోమవారం నాడు నోటీఫికేషన్ విడుదల చేసింది. పాన్ కోసం దరఖాస్తు చేసే ట్రాన్స్‌జెండర్ల కోసం దరఖాస్తు ఫారంలో ప్రత్యేకంగా ఓ టిక్ బాక్స్‌ను ఏర్పాటు చేశారు.
ఆధార్-పాన్ అనుసంధానంలో హిజ్రాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. దీనికి కారణం ఆధార్ కార్డులో జెండర్ ఎంపికలో ఆడ, మగతోపాటు హిజ్రాలకు ప్రత్యేకంగా థర్డజెండర్ ఆప్షన్ ఉన్నప్పటికీ పాన్ కార్డు దరఖాస్తులో ఆ వెసులుబాటు లేదు. ఆధార్‌కార్డుల్లో థర్డ్ జెండర్ అనీ, పాన్‌కార్డుల్లో మాత్రం పురుషుడు/మహిళ అని ఉండటంతో హిజ్రాలు తమ ఆధార్ నంబర్లను పాన్‌కు అనుసందించేందుకు ఇబ్బందులు పడ్డారు.
-
ఉస్తాద్ భగత్ సింగ్ ట్విట్టర్ రివ్యూ: బొమ్మ బ్లాక్ బస్టర్..!! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
విశాఖపట్నం-తిరుపతి మధ్య మరో రెగ్యులర్ ఎక్స్ ప్రెస్-ఈ రోజుల్లో..! హాల్ట్ లు ఇవే..! -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి -
`ఉస్తాద్` కోసం పవన్ రెమ్యునరేషన్ -
ఈ సీన్ పై సస్పెన్స్ వీడింది- క్లారిటీగా చెప్పిన శ్రీలీల -
H-1B Visa ఫీజు వ్యవహారం భారీ ట్విస్ట్- బ్యాక్ ఫైర్ -
ఐటెం సాంగ్ బ్యాన్ చేసిన కేంద్రం, పాన్ ఇండియా మూవీకి బిగ్ షాక్ -
వైసీపీలోకి రీ ఎంట్రీ పై తేల్చేసిన బాలినేని, ఆయన నాయకుడు మాత్రమే కాదు..!! -
యుద్ధం వేళ.. మోదీ మంత్రివర్గం సంచలన నిర్ణయాలు -
ఓటీటీలో దడ పుట్టించే హారర్ థ్రిల్లర్.. ఇప్పుడే చూసేయండి..












Click it and Unblock the Notifications