పెళ్ళివద్దన్న ప్రేయసిని నరికి చంపిన ప్రియుడు
పాలఘడ్ :వివాహం చేసుకోనేందుకు అంగీకరించని ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపాడు ఓ ప్రియుడు.ఈ ఘటన మహారాష్ట్రలో సంచలనం కల్గించింది.
మహారాష్ట్రలోని జవహార్ తాలుకాలోని తిలోండా గ్రామానికి చెందిననీలేష్ , ఖార్పడా కొన్నేళ్ళుగా రేమించుకొంటున్నారు.ఆమెను పెళ్ళిచేసుకోవాలని నీలేష్ భావించాడు.కాని, ఆమె మాత్రం అతడిని పెళ్ళి చేసుకొనేందుకు మాత్రం ఒప్పుకోలేదు.

కొంతకాలంగా ప్రేమించుకొంటున్న ఈ జంట విషయం గ్రామస్థులకు కూడ తెలుసు.అయితే ఖార్పడానే పెళ్ళాడుతానని నీలేష్ కుటుంబసభ్యులకు కూడ తేగేసి చెప్పాడు. కాని ఖార్పడా మాత్రం వివాహానికి ససేమిరా అంది.
వివా:హం చేసుకోవడానికి ఆమెను పలుమార్లు బతిమాలాడు .అయినా ఆమె అంగీకరించలేదు.దంతో ఒంటరిగా ఉన్న అదను చూసి గొడ్డలితో నరికి చంపాడు నీలేష్.ఆమె అక్కడికక్కడే మరణించింది. నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications