Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

దేశంలో బెస్ట్ ట్రెక్కింగ్​ స్పాట్స్ ఇవే.. లైఫ్ ​లో ఒక్కసారైనా వెళ్లి రావాల్సిందే..!

ఇటీవలికాలంలో చాలా మంది యువత ట్రెక్కింగ్ చేస్తున్నారు. చుట్టూ పచ్చని చెట్లు, అడవులు, ఎత్తైన కొండలు, చెంతనే గలగల ప్రవాహాలు ఇలాంటి మధురమైన వాతావరణం మధ్యలో ట్రెక్కింగ్ చేయడం ఓ మధురమైన అనుభూతి. వారాంతాల్లో.. వేసవి సెలవుల్లో ఇంటిళ్లి పాది ట్రెక్కింగ్, నైట్​ క్యాంపింగ్​, బోటింగ్​ అంటూ ప్రకృతిని ఆస్వాదించడానికి ఔటింగ్​ కు వెళ్లాలి అనుకుంటున్నారా..? అయితే భారత్ లో బెస్ట్ ట్రెక్కింగ్ ప్రదేశాలపై ఓ లుక్కేయండి..

భారత్ లో ట్రెక్కింగ్ కు అనువైన ప్రాంతాలు చాలానే ఉన్నాయి. అయితే వాటిలో ది బెస్ట్ ట్రెక్కింగ్ స్పాట్స్ అంటే ముందుగా గుర్తొచ్చేవి ఇవే.. లైఫ్ లో ఒక్కసారైనా ఇక్కడికి వెళ్లి రావాలనిపిస్తుంది.. అందులో మొదటిది ఫ్లవర్ వ్యాలీ . ఇది ఉత్తరాఖండ్ లోని హిమాలయ పర్వతశ్రేణిల్లో ఉంది. ఈ అద్భుతమైన ప్రాంతానికి ట్రెక్కింగ్ ద్వారానే చేరుకోవాలి. ఈ ప్రాంతాన్ని వ్యాలీ ఆఫ్ ఫ్లవర్స్ నేషనల్ పార్క్ గా గుర్తించారు. అలాగే 2002లో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశంగానూ గుర్తించింది. ఈ ట్రెక్కింగ్ ప్రాంతం ఉత్తరాఖండ్‌ లోని చమోలి జిల్లాలో ఉంది. ఈ ప్రాంతం సముద్ర మట్టానికి సుమారు 3,352 నుండి 3,658 మీటర్ల ఎత్తులో ఉంటుంది.

కేదార్​ నాథ్ ఓ పవిత్రమైన ఆధ్యాత్మిక ప్రదేశం. ఈ ప్రాంతం ఉత్తరాఖండ్ లోని గర్హ్‌వాల్ హిమాలయాల్లో నెలకొని ఉంది. ఇది ప్రసిద్ధ హిందూ పుణ్యక్షేత్రాలైన చార్ ధామ్ యాత్రలో ఒకటిగా ఉంది. ఇక కేదార్ నాథ్ కు ట్రెక్కింగ్ ద్వారా వెళ్లడం చాలా కష్టంతో కూడుకున్నది. కేదార్​ నాథ్ ప్రాంతానికి చేరుకోవాలంటే గౌరీకుండ్​ నుంచి 16 కిలో మీటర్ల మేర ట్రెక్కింగ్​ చేయాల్సి ఉంటుంది. ఉత్తరాఖండ్ లోని మరో ప్రముఖ పర్యాటక ప్రదేశం రూప్ కుంద్.

సాధారణంగా రూప్ కుంద్ ఓ సరస్సు ప్రాంతం. ఈ లేక్ ను మిస్టరీ లేక్ అని పిలుస్తుంటారు. ఈ సరస్సు సముద్ర మట్టానికి సుమారు 16, 500 అడుగల ఎత్తులో ఉంటుంది. అందువల్ల ఇక్కడికి ట్రెక్కింగ్ ద్వారా వెళ్లడం కూడా చాలా సాహసంతో కూడుకున్నది. ఈ ప్రాంతం సుందరమైన దృశ్యాలకు, గొప్ప అనుభూతిని కలిగిస్తుంది. ట్రెక్కింగ్ కు ప్రసిద్ధి చెందిన మరో ప్రదేశం జోంగ్రీ- గోచలా ట్రెక్కింగ్. ఈ ప్రాంతం సిక్కింలో ఉంది. ఈ ప్రాంతం ట్రెక్కింగ్ లో భాగంగా కాంచనజంగ్ పర్వతశ్రేణిలోని అద్భుతమైన దృశ్యాలను తనివితీరా ఆస్వాదించవచ్చు. ఇక జోంగ్రీ- గోచలా ట్రెక్కింగ్ ప్రాంతం 40 కిలోమీటర్ల పొడవు ఉంటుంది. దీనిని పూర్తి చేయడానికి 8 నుంచి 10 రోజుల సమయం పడుతుంది.

హిమాచల్ ప్రదేశ్ అంటేనే ప్రకృతి రమణీయమైన ప్రాంతాలకు నెలవు. ఇక్కడి కొండలు, లోయలు ఎంతో ప్రసిద్ధి చెందాయి. ఇక్కడ ఖీర్గంగా ట్రెక్కింగ్ చాలా ఫేమస్. కసోల్ నుంచి ప్రారంభం అయ్యే ఈ ట్రెక్కింగ్ ను పూర్తి చేయడానికి దాదాపు 10 గంటలు పడుతుంది. పర్యటకులు ఏప్రిల్ నుంచి జూన్ వరకు అలాగే సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య ట్రెక్కింగ్ చేస్తుంటారు. ఈ సమయంలో ఇక్కడి వాతావరణం చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది.

Trekking Best Spots in India You Must Visit at Least Once in Your Lifetime famous treks India list

ఇక దూద్ సాగర్ జలపాతం గురించి మనందరికీ తెలిసిందే. ఈ జలపాతం గోవా, కర్ణాటక రాష్ట్రాల సరిహద్దులో పశ్చిమ కనుమలలో ఉంటుంది. చుట్టూ దట్టమైన అడవి ఉంటుంది. ఈ జలపాతాన్ని సందర్శించడానికి జూన్ నుంచి సెప్టెంబర్ మంచి టైమ్ అని చెబుతుంటారు. ఈ సమయంలో ఈ ప్రాంతంలోని వాతావరణం ట్రెక్కింగ్ కు అనుకూలంగా ఉంటుంది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+