విషమిచ్చి .. లైంగికదాడికి పాల్పడ్డి ... మధ్యప్రదేశ్‌లో దారుణం ...
కోటా : నవ భారతం .. అత్యాచారంగా మారిపోతోంది. నిత్యం ఎక్కడో ఓ చోట మహిళ లైంగికదాడికి గురవుతూనే ఉంది. మరికొందరు కీచకులు రేప్ చేసి.. ఊపిరి తీసి తమ పైశాచికత్వాన్ని ప్రదర్శిస్తున్నారు. నిర్భయ లాంటి కఠిన శిక్షలు అమలు చేస్తోన్నా ... నిందితుల్లో ఏ మాత్రం మార్పు రాకపోవడం ... భయం లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది.
పైశాచిక పర్వం ..
మధ్యప్రదేశ్‌లో మరో యువతి లైంగికదాడికి గురైంది. రాజస్థాన్ కంజార్ చెందిన గిరిజన మహిళలు .. మధ్యప్రదేశ్ గుణకు వెళ్లారు. అక్కడ తమ ప్రదర్శన ముగించుకొని తిరిగి వస్తోండగా మృత్యువు స్వాగతం పలికింది. ఇద్దరు మహిళలను గుణకు చెందిన యువకులు బయటకు తీసుకెళ్లారు.నిర్జీవ ప్రాంతానికి తీసుకెళ్లి లైంగికదాడి చేశారు. అందులో ఒక 20 ఏళ్ల మహిళకు విషం తాగించాడు కీచకుడు. దాంతో లైంగికదాడి చేసి .. తర్వాత రైల్వేస్టేషన్‌లో దిగబెట్టారు. అప్పటికే విష ప్రభావంతో ఆ యువతి సృహ కోల్పోయింది.

తిరిగిరాని లోకాలకు ...
రైలులో తమ ఇల్లు చేరిన యువతిని ఆస్పత్రిలో చేర్చారు. కానీ ప్రయోజనం లేకపోయింది. ఆ గిరిజన మహిళ ఆసువులు బాసింది. దీంతో లైంగికదాడికి గురైన మరో మహిళ జరిగిన ఘటన గురించి తెలిపింది. యువతి మృతదేహినిక పోస్టుమార్టం చేశాక .. డెడ్ బాడీని బంధువులకు అప్పగించారు. నిందితుల్లో ఒకరు పంకాజ్ కలాల్ గా గుర్తించామని పోలీసులు తెలిపారు.
లైంగికదాడి, అటెంప్ట్ మర్డర్ తదితర సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టు పోలీసులు తెలిపారు. స్థానికంగా ఈ ఘటన కలకలం రేపింది. లైంగికదాడి చేయడమే గాక .. చంపడం ఏంటి అని గిరిజనులు ప్రశ్నిస్తున్నారు. నిందితులపై కఠినచర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.












Click it and Unblock the Notifications