దిశ ఎఫెక్ట్: ఆన్ లైన్ లో అశ్లీల వీడియోలు షేరింగ్, తట్టుకోలేకపోయారు, తోపు రాజ బాక్స్ బద్దలు!
చెన్నై/తిరుచ్చి: మొబైల్ ఇంటర్నెట్ ఫ్రీ ఫ్రీ అంటూ ఇష్టం వచ్చినట్లు విచ్చలవిడిగా మైనర్ అమ్మాయిలు, చిన్న పిల్లలు, యువతులు, మహిళలకు సంబంధించిన అశ్లీల వీడియోలు ఆన్ లైన్ మెసేంజర్ గ్రూప్ పేరిట వందల మందికి షేర్ చేస్తున్న వ్యక్తిని తమిళనాడులోని తిరుచ్చిలో పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ వెటర్నటీ డాక్టర్ దిశా ఘటన తరువాత తమిళనాడు పోలీసులు యువతులు, బాలికలు, మహిళకు రక్షణ మెరుగుపరిచే విధంగా కఠిన చర్యలు చేపట్టడంతో విచ్చలవిడిగా అశ్లీల వీడియోలు షేర్ చేస్తున్న వ్యక్తి బాక్స్ బద్దలైయ్యింది.

ఇది తమిళనాడు పోలీసు లెక్క
యువతులు, బాలికలు, మహిళకు రక్షణ మెరుగుపరిచే విధంగా తమిళనాడు పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగో ఎక్కవ సమయం ఆన్ లైన్ లో గడుపుతూ అశ్లీల వీడియోలను వీక్షించే వారిని, అశ్లీల వీడియోలు డౌన్ లోడ్ చేసే వారిని, అశ్లీల వీడియోలు షేరింగ్ చేసే వాళ్లను గుర్తించి అరెస్టు చేసి కటకటాలకు నెడుతామని ఇప్పటికే తమిళనాడు పోలీసులు హెచ్చరించారు.

7 ఏళ్లు జైలు శిక్ష
ఆన్ లైన్ లో గడుపుతూ అశ్లీల వీడియోలను వీక్షించే వారిని, అశ్లీల వీడియోలు డౌన్ లోడ్ చేసే వారిని, అశ్లీల వీడియోలు షేరింగ్ చేసే వాళ్లు పదేపదే మాకు పట్టుబడితే 7 ఏళ్లు జైలు శిక్ష తప్పదని, కచ్చితంగా జైలుకు పంపిస్తామని తమిళనాడు పోలీసులు ఇప్పటికే వార్నింగ్ ఇచ్చారు.

మెసెంజర్ గ్రూప్ తోపు రాజు
తమిళనాడులోని తిరుచ్చికి చెందిన క్రిష్టఫర్ అల్ఫోన్స్ రాజా (40) అనే వ్యక్తి ఓ మెసెంజర్ గ్రూప్ క్రియేట్ చేసుకుని వందలాది మందికి అశ్లీల వీడియోలు విచ్చలవిడిగా షేరింగ్ చేస్తున్నాడు. అశ్లీల వీడియోలు షేర్ చేస్తున్న తోపు రాజ విషయాన్ని సైబర్ క్రైం పోలీసులు పసిగట్టారు.

నేను తట్టుకోలేకపోతున్నా
రాజాపేట న్యూ వీధికి చెందిన ముత్తుపాండి అనే వ్యక్తికి క్రిష్టఫర్ అల్ఫోన్స్ రాజా విచ్చలవిడిగా అశ్లీల వీడియోలు పంపించడం మొదలుపెట్టాడు. పదేపదే మొబైల్ లో అశ్లీల వీడియోలు చేసి తట్టుకోలేని ముత్తుపాండి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు సైతం క్రిష్టఫర్ అల్ఫోన్స్ రాజాపై మరింత నిఘా పెంచారు. ఐపీ అడ్రస్ ఆధారంగా క్రిష్టఫర్ అల్ఫోన్స్ రాజా ఫోన్ నెంబర్, ఇంటి అడ్రస్ ను కనిపెట్టి అతన్ని అరెస్టు చేశారు.

ఆన్ లైన్ లో యువతులు, మహిళలు
క్రిష్టఫర్ అల్ఫోన్స్ రాజా పదేపదే వందల మందికి అశ్లీల వీడియోలు షేర్ చేశాడని, నిందితుడి దెబ్బకు యువతులు, మహిళలు ఇబ్బందులకు గురైనారని అనుమానం ఉందని పోలీసులు అంటున్నారు. తోపు రాజ పూర్తి సమాచారం సేకరిస్తున్నామని పోలీసులు అన్నారు. ఆన్ లైన్ లో మహిళలు, యువతులు, పిల్లల అశ్లీల వీడియోలు షేరింగ్ చేస్తున్న వారి మీద తమిళనాడు పోలీసులు గట్టి నిఘా వేశారు.
-
దేశవ్యాప్తంగా 'ఎనర్జీ లాక్ డౌన్'.. ప్రతి బుధవారం సెలవు.. కఠినమైన రూల్స్ అమల్లోకి..! -
వాస్తు ప్రకారం ఐశ్వర్యాన్ని తెచ్చేది మనీప్లాంట్ కాదు.. 'క్రాసులా' మొక్కను పెంచాలి -
కేసీఆర్ ఫోన్, పరుగులు పెట్టిన ఆఫీసర్లు. -
మరో 100 కోట్ల బొమ్మ.. హిట్ మీద హిట్ కొట్టడం నీకే సాధ్యం అన్న -
విద్యార్థులకు గుడ్ న్యూస్.. మరో 4 రోజులు స్కూళ్లకు సెలవులు..! -
మూడు జోన్లుగా తిరుమల -
IPL 2025: రూ.26 కోట్ల ఆటగాడు ముంచితే.. రూ.2.6 కోట్ల కుర్రాడు గెలిపించాడు! -
ఈ రాశులకు అద్భుతం జరగబోతోంది -
రైతు భరోసా రెండు, మూడో విడత నిధుల జమ షెడ్యూల్ ఫిక్స్- ఎవరికి ఎప్పుడు..!! -
రామ్ చరణ్ "పెద్ది" కోసం ప్రభాస్ ఫేవరెట్ బ్యూటీ.. -
పదో తరగతి ఫలితాల విడుదల పై తాజా నిర్ణయం..!! -
నితీష్ కొత్త ఎత్తుగడ.. కేంద్రానికి బిగ్ షాక్!












Click it and Unblock the Notifications