Tamilnadu: స్టాలిన్ కు మళ్లీ దొరికిన బీజేపీ..! తమిళిసై గగ్గోలు..!

తమిళనాడు(Tamilnadu)లో అసెంబ్లీ ఎన్నికలకు రంగం సిద్ధమవుతున్న వేళ మరోసారి హిందీ రాజకీయాలు తెరపైకి వచ్చాయి. అసలే రాష్ట్రంలో ఏదో విధంగా ఉనికి చాటుకునేందుకు ప్రయత్నిస్తున్న బీజేపీ.. రైల్వేశాఖ చేసిన ఓ పొరబాటుతో ఇరుకునపడింది. ఇదే అదనుగా సీఎం ఎంకే స్టాలిన్ చెడుగుడు ప్రారంభించారు. ఇది గుర్తించిన బీజేపీ నేత తమిళి సై సౌందరరాజన్ వెంటనే రైల్వేమంత్రి జోక్యం కోరారు. దీంతో రైల్వేశాఖ ఇప్పుడు ఏం చేయబోతోందన్నది ఆసక్తికరంగా మారింది.

తమిళనాడులో కొత్తగా నిర్మించిన తిరుచ్చి జోనల్ రైల్వే కార్యాలయం ప్రవేశద్వారం వద్ద కర్తవ్య ద్వార్ పేరుతో ఓ పేరుతో నేమ్ ప్లేట్లు పెట్టారు. వీటిని హిందీ, తమిళ, ఇంగ్లీష్ భాషల్లో పెట్టారు. దీంతో కర్తవ్య ద్వార్ అనే తమిళులకు అర్దం కాని పెట్టడమే కాకుండా దాన్ని మూడు భాషల్లో ముద్రిస్తారా అంటూ వారు భగ్గుమంటున్నారు. తమిళం మాట్లాడే ప్రాంతంలో హిందీని రుద్దుతున్నారనే విమర్శలకు ఇది కారణమవుతోంది. దీనిపై సీఎం స్టాలిన్ జోక్యం చేసుకుని ట్వీట్ చేశారు.

Trichy Railway s Kartavya Dwar Sign Ignites Hindi Imposition Fury in Tamil Nadu

తమిళనాడులో హిందీని బలవంతంగా రుద్దేందుకు బీజేపీ ప్రయత్నిస్తోందని ఎన్నికల వేళ సీఎం స్టాలిన్ చేసిన ఆరోపణలు రాష్ట్రంలో చర్చనీయాంశంగా మారాయి. స్థానిక భాషా భావాలను విస్మరించవద్దని ఆయన కేంద్రాన్ని హెచ్చరించారు. దీంతో బీజేపీ నేత తమిళిసై సౌందర రాజన్ వెంటనే రంగంలోకి దిగారు. తాను కూడా ఈ పేరుపై అభ్యంతరం వ్యక్తం చేశారు. తమిళ నేమ్ ప్లేట్ పెట్టాలని డిమాండ్ చేయడంతో పాటు ప్రాంతీయ భాషలకు ప్రాధాన్యం ఇవ్వాలంటూ నేరుగా రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ను ట్యాగ్ చేస్తూ ట్వీట్ చేశారు. తాజా పరిణామాలతో అసలే ఎన్నికల వేళ ఇది తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందో అన్న ఆందోళన బీజేపీ నేతల్లో పెరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+