ఈడీ భయం.. ఫోన్ డ్రైనేజీలో పడేసి.. ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకిన ఎమ్మెల్యే
సాధారణంగా పోలీసుల్ని చూసినప్పుడు దొంగలు కూడా ఇలాగే పారిపోతుంటారు. గోడలు, గేట్లు దూకి అక్కడి నుంచి తప్పించుకుంటారు. అయితే వెస్ట్ బెంగాల్ లో ఇలాంటి షాకింగ్ ఘటనే జరిగింది. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులకు బయపడిన ఓ ఎమ్మెల్యే ఏకంగా బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచే దూకేశారు. ఫోన్ ను డ్రైనేజీలో పడేశారు. అయితే ఎట్టకేలకు ఈడీ అధికారులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
పశ్చిమ బెంగాల్ లోని తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే జిబన్ కిషన్ సాహా చేష్టలు చూస్తే షాక్ అవ్వాల్సిందే. రాష్ట్రంలో జరిగిన టీచర్స్ రిక్రూట్ మెంట్ స్కామ్ లో భాగంగా అతడ్ని విచారించేందుకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ED) అధికారులు ముర్షిదాబాద్ లోని ఎమ్మెల్యే ఇంటిపై రైడ్ చేశారు. ఈ విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే కిషన్ సహా.. బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేసి డ్రైనేజీలో ఫోన్ పడేసి పొలాల్లోకి పరిగెత్తుతూ తప్పించుకునేందుకు యత్నించారు. కానీ అతడ్ని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
పశ్చిమ బెంగాల్ లోని పాఠశాలల్లో ఉపాధ్యాయులు, ఇతర సిబ్బంది నియామకాల్లో జరిగిన కుంభకోణంపై ED అధికారులు.. ముర్షిదాబాద్ జిల్లా బుర్వాన్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జిబన్ కిషన్ సాహా, అతడి కుటుంబ సభ్యులు, వ్యక్తిగత సిబ్బందిపై తీవ్ర అభియోగాలు మోపారు. టీచర్ల రిక్రూట్ మెంట్ భారీగా మనీ లాండరింగ్ జరిగిందని ఈడీ పేర్కొంది.

ఈ మేరకు ఎమ్మెల్యే కిషన్ సాహా ఇంటితోపాటు అతని సన్నిహితుల రహస్య ప్రదేశాల్లో ఈడీ దాడులు నిర్వహించింది. దాడుల గురించి తెలుసుకున్న సాహా.. బిల్డింగ్ ఫస్ట్ ఫ్లోర్ నుంచి దూకేసి డ్రైనేజీలో ఫోన్ పడేసి పొలాల్లోకి పరిగెత్తుతూ తప్పించుకునేందుకు యత్నించారు. కానీ అతడ్ని ఈడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. దీంతో ఆయన బట్టలు మొత్తం బురదతో నిండిపోయాయి. డ్రైనేజీలో వేసిన ఫోన్ లను సైతం ఈడీ అధికారులు స్వాధీనం చేసుకుని ఫోరెన్సిక్ టెస్టుకు పంపించారు. ఈ స్కామ్ లో ఇప్పటికే పలువురు అధికారులపై ఈడీ దర్యాప్తు నిర్వహించింది.
-
మెగాస్టార్ కొత్త మూవీ షూటింగ్ షురూ.. క్లాప్ కొట్టిన పవన్ !! -
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!!












Click it and Unblock the Notifications