త్రిష.. లక్కీ హ్యాండ్
తమిళనాడులో పోలింగ్ ఆరంభమైంది. ఈ ఉదయం సరిగ్గా 7 గంటలకు పోలింగ్ కొనసాగుతోంది. మొత్తం 234 నియోజకవర్గాలకు నేడు ఒకే దశలో ఓటింగ్ జరుగుతోంది. డీఎంకే, ఏఐఏడీఎంకే, టీవీకే.. ఈ ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి. గెలిచి తీరాలనే పట్టుదలతో ఎన్నికల ప్రచారాన్ని కొనసాగించాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్రతివ్యూహాలను రూపొందించుకున్నాయి. టీవీకే పూర్తిస్థాయిలో ఎన్నికల బరిలో నిల్చోవడం వల్ల త్రిముఖ పోరు ఏర్పడింది. దాదాపు అన్ని నియోజకవర్గాల్లోనూ హోరాహోరి పోరు నెలకొంది. ఈ పోరులో విజేత ఎవరనేది మే 4వ తేలుతుంది.
టీవీకే చీఫ్ విజయ్ ఈ ఉదయమే తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నీలాంకారైలో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్ లో ఓటు వేశారు. పోలింగ్ కేంద్రానికి చేరుకున్నప్పుడు అక్కడ కొంత గందరగోళం నెలకొంది. విజయ్ రాకతో ఆయన అభిమానులు, మీడియా ప్రతినిధులు భారీ సంఖ్యలో ఒకేసారి దూసుకువచ్చారు. ఆయన ఫొటోలు తీయడానికి ఎగబడ్డారు. దీంతో అక్కడ ఏర్పాటు చేసిన తాత్కాలిక షామియానా కూలిపోయింది. షామియానాకు సపోర్ట్ గా పెట్టిన కర్రలు వంగిపోయాయి.

తాజాగా ప్రముఖ నటి త్రిష తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కొద్దిసేపటి కిందటే తన తల్లితో కలిసి చెన్నై అభిరామాపురంలోని సెయింట్ ఫ్రాన్సిస్ జేవియర్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రానికి వచ్చారు. తనవంతు వచ్చేంత వరకు ఓటర్లతో పాటు క్యూ లో నిల్చున్నారు. అనంతరం ఓటు వేశారు. అనంతరం పోలింగ్ కేంద్రం ఆవరణలో తనను కలిసిన విలేకరులతో మాట్లాడారు. ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు.
ప్రత్యేకించి తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి యువత పెద్ద ఎత్తున తరలి రావాలని త్రిష విజ్ఞప్తి చెప్పారు. తొలిసారి ఓటు వేయబోతోన్న వారికి ఆమె విషెస్ చెప్పారు. ఈ ఎన్నికల్లో త్రిష ప్రధాన ఆకర్షణగా నిలిచిన విషయం తెలిసిందే. ఒకవంక జోరుగా ప్రచారం కొనసాగుతున్న సమయంలోనే ఆమె విజయ్ తో కలిసి ఓ వెడ్డింగ్ ఫంక్షన్ కు హాజరయ్యారు. విజయ్ తో కలిసి ఒకే కారులో రావడం చర్చనీయాంశమైంది.
అంతకుముందే విజయ్ విడాకుల వ్యవహారం తెరమీదికి వచ్చింది. ఆయన భార్య సంగీత స్వర్ణలింగం విడాకుల కోసం కోర్టుకెక్కారు. ప్రస్తుతం ఇది విచారణ దశలో ఉంది. తన వైవాహిక సమస్యలను ఫ్యామిలీ కోర్టు వెలుపలే పరిష్కరించుకోవాలని విజయ్ చూస్తున్నట్లు అప్పట్లో వార్తలొచ్చాయి. కోర్టు వెలుపల సెటిల్‌మెంట్ చేసుకునే దిశగా వారి మధ్య చర్చలు జరిగాయని, సుమారు 250 కోట్ల రూపాయల మొత్తాన్ని భరణంగా చెల్లించడానికి సిద్ధంగా ఉన్నారనేది వాటి సారాంశం.












Click it and Unblock the Notifications