'ఢిల్లీ జూ' తెల్లపులిపై దయ చూపండంటున్న హీరోయిన్
న్యూఢిల్లీ: కొన్ని రోజుల క్రితం దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఓ జూలో తెల్లపులి ఎన్ క్లోజర్‌లో పడిపోగా ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థి చంపిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఆ పులిని చంపేయాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీకి పెద్ద ఎత్తున ట్వీట్స్ చేస్తున్నారు.
ఐతే మరికొందరు మాత్రం ఈ పులిపై జాలిపడుతున్నారు. అలాంటి వారికి మద్దతుగా త్రిష, లావణ్య త్రిపాఠి రంగంలోకి దిగారు. ఈ తెల్లపులిపై దయ చూపాలంటూ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ట్విట్టర్‌లో త్రిష పేర్కొన్నారు.

ప్రపంచ వ్యాప్తంగా జంతువుల కోసం పోరాడే 'పెటా' సంస్దలో హీరోయిన్ త్రిష వాలంటీర్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎన్‌క్లోజర్‌లో పడిన విద్యార్థి... తనను ఏం చేయవద్దంటూ కొద్ది నిమిషాల సేపు పులిని ప్రాధేయపడిన సంఘటన అందరినీ కదిలించింది. చనిపోవడానికి ముందు అతను తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.
యువకుడిని పొట్టన పెట్టుకున్న పులి పేరు విజయ్. 2007లో జన్మించిన దీని బరువు 200 కిలోలు. ఇది రోజుకు పది కిలోల మాంసం తింటుంది. పులి ఉండే ఆవరణలో ఆ యువకుడు పడినా కాసేపటి వరకు పులి అతని పైన దాడి చేయలేదని, ఇంతలో దాని పైకి రాళ్లు విసరడంతో దాడికి పాల్పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. ఈ ఘటన తర్వాత పులిని చూసేందుకు ఆ జూకు పెద్ద ఎత్తున వీక్షకులు తరలి వస్తున్నారట. విద్యార్థిని పులిని చంపిన సంఘటన మంగళవారం జరిగింది. ఆ తర్వాత రోజు నుండి చాలామంది ఆ తెల్లపులిని చూసేందుకు వస్తున్నారట.












Click it and Unblock the Notifications