"అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో త్రిష ఫొటో పెట్టాలి"

తమిళనాడులో టీవీకే ప్రభుత్వం కొలువుదీరి నేటికి 50 రోజులు పూర్తి కావొస్తున్న సంగతి తెలిసిందే. పార్టీపెట్టిన తొలిసారే ఏకంగా సీఎం పీఠాన్ని కైవసం చేసుకున్నారు దళపతి విజయ్. తనదైన శైలిలో పరిపాలన సాగిస్తూ ముందుకు సాగుతున్నారు. ఇక ఇటీవల విజయ్ 52 వ పుట్టినరోజు తమిళనాడు వ్యాప్తంగా ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. సీఎం విజయ్ కు సినీ, రాజకీయ ప్రముఖులు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా విజయ్ కు శుభాకాంక్షలు తెలిపారు. విజయ్ బర్త్ డే సందర్భంగా.. రాష్ట్ర వ్యాప్తంగా సేవా కార్యక్రమాలు, కేక్ కట్టింగ్స్, అలాగే అన్నదానాలు, రక్తదానాలు, పేదలకు నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు ఫ్యాన్స్.

ఇక స్టార్ హీరోయిన్ త్రిష.. విజయ్ కు స్పెషల్ విషెస్ చెప్పిన విషయం తెలిసిందే. విజయ్ బర్త్ డే జూన్ 22 కాగా ఆమె జూన్ 23 న సాయంత్రం పోస్టు పెట్టడం విశేషం. సామాజిక మాధ్యమాల్లో క్షణాల్లోనే ఈ పోస్ట్ వైరల్ అయింది. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ముందు నుంచే విజయ్- హీరోయిన్ త్రిష మధ్య ఏదో ఉందని ప్రచారం జరుగుతూ వచ్చిన విషయం తెలిసిందే. ఇదే సమయంలో విజయ్ సతీమణి సంగీత విడాకులు కోరుతూ కోర్టులో పిటిషన్ దాఖలు చేయడం చకచకా జరిగిపోయాయి.

ఇదే సమయంలో విజయ్ బర్త్ డే సందర్భంగా త్రిష ఎలాంటి విష్ చేయలేదు. దాంతో విజయ్- సంగీత మళ్లీ కలిసిపోయారని.. త్రిషకు విజయ్ బ్రేకప్ చెప్పారని అందుకే విజయ్ ను త్రిష అన్ ఫాలో చేసిందని సోషల్ మీడియాలో వార్తలు గుప్పుమన్నాయి. అయితే వాటన్నింటికీ త్రిష ఒక్క పోస్టుతో చెక్ పెట్టినట్లు అయింది.

Trisha Photo in Govt Offices Demand Karaikudi Councilor s Remark Triggers Viral Video Trishaphoto

అయితే తాజాగా కరైకుడి కార్పొరేషన్ మీటింగ్ లో జరిగిన ఓ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇక్కడ జరిగిన కౌన్సిల్ మీటింగ్ లో ప్రస్తుత సీఎం విజయ్ ఫొటోతో పాటు మాజీ సీఎంలు అయిన డీఎంకే అధినేత స్టాలిన్, అన్నాడీఎంకే అధినేత్రి జయలలిత ఫొటోలు కూడా పెట్టాలని వివిధ పార్టీలకు చెందిన కౌన్సిలర్లు వాగ్వాదానికి దిగారు.

ఈ మేరకు సీఎం విజయ్ ఫొటో పక్కన తమ నాయకుల ఫొటోలు పెట్టేందుకు డీఎంకే, అన్నాడీఎంకే నేతలు తోసుకుంటూ ముందుకు వచ్చారు. ఈ సమయంలో అదే మీటింగ్ లో ఉన్న 11 వ వార్డ్ ఇండిపెండెంట్ కౌన్సిలర్ లేచి నిల్చొని ఆ ఫొటోల పక్కన త్రిష ఫొటో కూడా పెట్టాలని గట్టిగా అరుస్తూ కేకలు వేశారు. దాంతో అక్కడున్నవాళ్లు ఆయన వ్యాఖ్యలకు ఒక్కసారిగా షాక్ తిన్నారు. ఆయన వ్యాఖ్యలకు మీటింగ్ లోని వాళ్లు ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+