ఎగ్జిట్ పోల్స్ వేళ.. కాంగ్రెస్ సంచలన నిర్ణయం: పీసీసీకి ఆదేశాలు

Lok Sabha elections 2024 Phase 7: దేశంలో సార్వత్రిక ఎన్నికల కోలాహలం ఇంకొన్ని గంటల్లో ముగుస్తుంది. శనివారం అంటే- జూన్ 1వ తేదీన ఏడో విడత పోలింగ్ జరుగనుంది. ఇదే చివరిది. ఇప్పటివరకు ఆరుదశల్లో పోలింగ్ ముగిసింది. ఏపీ అసెంబ్లీ వివిధ రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఓటింగ్ ప్రక్రియ పూర్తయింది.

చివరి విడతలో మొత్తం ఎనిమిది రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లో 57 లోక్‌సభ స్థానాలకు పోలింగ్ నిర్వహించనున్నారు. బిహార్- 8, చండీగఢ్- 1, హిమాచల్ ప్రదేశ్- 4, జార్ఖండ్- 3, ఒడిశా- 6, పంజాబ్- 13, ఉత్తరప్రదేశ్- 13, పశ్చిమ బెంగాల్- 9 లోక్‌సభ నియోజకవర్గాల్లో పోలింగ్ షెడ్యూల్ అయిందా రోజున.

TRP game Congress decided not to participate in the exit poll debates

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సహా మొత్తం 598 మంది అభ్యర్థులు రంగంలో నిలిచారు. మోదీ పోటీలో నిలిచిన ఉత్తరప్రదేశ్‌లోని వారణాశి నియోజకవర్గానికీ అదే రోజున పోలింగ్ ఉంటుంది. సాయంత్రం 6: 30 గంటలకు అధికారికంగా పోలింగ్ ముగుస్తుంది. అప్పటివరకు క్యూలో ఉన్న వారికి ఓటు వినియోగించుకునే అవకాశం ఇస్తారు పోలింగ్ సిబ్బంది.

కాగా సాయంత్రం 6:30 గంటల తరువాత ఎగ్జిట్ పోల్స్ సందడి మొదలవుతుంది. మే 13వ తేదీన ఏపీలో జరిగిన 175 అసెంబ్లీ, 25 లోక్‌సభ, తెలంగాణలో 17 లోక్‌సభ నియోజకవర్గాలపై ఎగ్జిట్ పోల్స్ అంచనాలు ఒక్కసారిగా వెలువడటం ప్రారంభమౌతుంది. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా వెలువడే ఫలితాలకు ఇంచుమించుగా సరిపోయేలా ఇవి ఉండొచ్చు.

ఇండియాటుడే- మైయాక్సిస్, చాణక్య, ఇండియా టీవీ, న్యూస్ 18, సీఎన్‌బీసీ, ఎన్డీటీవీ.. వంటి పలు జాతీయ మీడియా సంస్థలతో పాటు ఏపీ- తెలంగాణకు చెందిన ఆరా వంటి ఎన్నికల సర్వే సంస్థలు తమ అంచనాలను వెల్లడించబోతోన్నాయి. ప్రస్తుతం ఈ ఎగ్జిట్ పోల్స్ మీదే అందరి దృష్టీ నిలిచింది.

ఎగ్జిట్ పోల్స్ విడుదల సందర్భంగా టీవీ ఛానళ్లు నిర్వహించబోయే డిబేట్ల విషయంలో కాంగ్రెస్ పార్టీ ఓ కీలక నిర్ణయాన్ని తీసుకుంది. ఆయా డిబేట్లల్లో కాంగ్రెస్ నుంచి ఏ ఒక్కరూ కూడా పాల్గొనట్లేదు. పార్ట ప్రతినిధులుగా ఎవ్వరినీ పంపించవద్దంటూ అన్ని రాష్ట్రాల ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీలకు ఏఐసీసీ నుంచి ఆదేశాలు జారీ అయ్యాయి.

ఈ విషయాన్ని కాంగ్రెస్ సీనియర్ నేత పవన్ ఖేరా నిర్ధారించారు. ఏడో విడత మినహా ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని, వారి ఇచ్చే తీర్పు ఏమిటనేది ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తమై ఉందని అన్నారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్బంగా ప్రజాభిప్రాయం ఏమిటనేది తేటతెల్లమౌతుందని పేర్కొన్నారు.

ఈ పరిస్థితుల్లో జరగబోయే డిబేట్లు, అంచనాలు, అభిప్రాయాల్లో తాము పాలుపంచుకోకూడదని, అవన్నీ కూడా టీఆర్పీ గేమ్‌లో భాగమేనని పవన్ ఖేరా వ్యాఖ్యానించారు. ఇలాంటి టీఆర్పీ గేమ్‌లల్లో పాల్గొనడం వల్ల ఎలాంటి ఉపయోగం ఉండబోదని తాము భావిస్తోన్నట్లు చెప్పారు. జూన్ 4వ తేదీన ఓట్ల లెక్కింపు సందర్భంగా జరిగే డిబేట్లల్లో మాత్రం తాము పాల్గొంటామని స్పష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+