చేవెళ్ల విషాదం నుంచి కోలుకోకముందే: నడిరోడ్డుపై టిప్పర్ బీభత్సం:19 మంది మృతి

రంగారెడ్డి జిల్లా చేవెళ్ల తరహా రోడ్డు ప్రమాదం రాజస్థాన్ లో చోటు చేసుకుంది. నడిరోడ్డు మీద ఓ భారీ టిప్పర్ బీభత్సం సృష్టించింది. అదుపు తప్పి వాహనాలపైకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో 19 మంది దుర్మరణం పాలయ్యారు. 50 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. పదుల సంఖ్యలో వాహనాలు ధ్వంసం అయ్యాయి. డ్రైవర్ మద్యం సేవించి టిప్పర్ ను నడపడం, అతివేగమే దీనికి ప్రధాన కారణమని పోలీసులు తేల్చారు. కేసు నమోదు చేశారు. బ్రేకులు ఫెయిల్ అయ్యాయని తెలుస్తోంది.

జైపూర్ లోని లోహామండి రోడ్డులో టిప్పర్ డ్రైవర్ మద్యం మత్తులో నియంత్రణ కోల్పోయాడు. వాహనాలను ఢీకొట్టాడు. సుమారు అయిదు కిలోమీటర్ల దూరం దూసుకెళ్లాడు. కార్లు, స్కూటర్లు సహా అనేక వాహనాలు ధ్వంసమయ్యాయి. లోహామండి జంక్షన్ నుంచి ప్యాలెస్ రోడ్ మీదుగా సుమారు అయిదు కిలోమీటర్ల మేర వాహనాలు ధ్వంసమైనట్లు పోలీసులు వెల్లడించారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు.

Truck Driver s Rampage Claims 10 Lives in Jaipur

సమయంలో డ్రైవర్‌ మద్యం సేవించి ఉన్నాడని, అనేక వాహనాలను ఢీకొడుతూ వేగంగా వెళ్లాడని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎదురొచ్చిన వాహనాలను ఢీకొడుతూనే డ్రైవర్‌ దూసుకెళ్లాడని చెప్పారు. అప్పటికే ట్రక్కు కింద అనేక వాహనాలు చిక్కుకుపోయాయి. ఆపడానికి ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదని ప్రత్యక్ష సాక్షలు చెప్పారు. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు ఆ టిప్పర్ కొంతదూరం పాటు వెంటాడారు. అది ఆగిన వెంటనే- పారిపోవడానికి ప్రయత్నించిన డ్రైవర్ ను అదుపులోకి తీసుకున్నారు.

ఈ ఘటనలో 10 మంది దుర్మరణం పాలయ్యారు. మృతదేహాలు ఛిద్రం అయ్యాయి. శరీర భాగాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. కాళ్లు, చేతులు తెగిపడ్డాయి. రక్తం ఏరులై పారింది. లోహా మండి ప్రాంతంలో మధ్యాహ్నం ఒ్గంటిగంట సమయంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. లోహా మండి పెట్రోల్ పంప్ నుండి నంబర్ 14 రోడ్డు గుండా హైవే చేరుకోవడానికి టిప్పర్ ప్రయత్నిస్తుండగా బ్రేకులు ఫెయిల్ అయ్యాయి. దీంతో నియంత్రణ కోల్పోయిన లారీ, రోడ్డుపై ఉన్న వాహనాలను ఢీకొట్టింది.

టిప్పర్ వేగం ఎక్కువగా ఉండటంతో దాదాపు 300 మీటర్ల దూరం వరకు వాహనాలను ఢీకొంటూ వెళ్లింది. ముందుగా ఒక కారును ఢీకొని, ఆపై బైక్‌లు, ఆటో రిక్షాలతో సహా అనేక వాహనాలను నుజ్జునుజ్జు చేసింది. కార్లు, ఆటోలు, బైక్ లపై ఉన్న వాళ్లు దాని కింద పడి అక్కడికక్కడే మరణించారు. ఘటన జరిగిన వెంటనే స్థానికులు సహాయక చర్యలు ప్రారంభించారు. వాహనాల్లో చిక్కుకున్న వారిని బయటకు తీసి అంబులెన్స్‌లకు సమాచారం అందించారు. గాయపడిన వారిని కాన్వటియా ఆసుపత్రి, ఎస్ఎంఎస్ ట్రామా సెంటర్‌లకు తరలించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+