పట్టుమని 10రోజులకే: ఆ పోస్టు నుంచి స్కారాముసిని పీకిపారేసిన ట్రంప్

గతవారం 'న్యూ యార్కర్‌' మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా స్కారాముసి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఫలితమే ఈ ఉద్వాసనకు కారణంగా తెలుస్తోంది.

వాషింగ్టన్: పట్టుమని 10రోజులకే వైట్ హౌజ్ కమ్యూనికేషన్స్ పదవి నుంచి ఆంటోనీ స్కారాముసికి అధ్యక్షుడు ట్రంప్ ఉద్వాసన పలికారు. సోమవారం ఆంటోనీని పదవి నుంచి తొలగిస్తూ ట్రంప్‌ నిర్ణయం తీసుకున్నారు.

గతవారం 'న్యూ యార్కర్‌' మ్యాగజైన్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన సందర్భంగా స్కారాముసి చేసిన వివాదాస్పద వ్యాఖ్యల ఫలితమే ఈ ఉద్వాసనకు కారణంగా తెలుస్తోంది. అప్పటి వైట్‌హైజ్‌ చీఫ్‌ ఆఫ్‌ స్టాఫ్‌ రెయిన్స్‌ ప్రీబస్‌, ట్రంప్‌ ప్రధాన వ్యూహకర్తగా పనిచేస్తున్న స్టీవ్‌ బనాన్‌పై ఇంటర్వ్యూలో స్కారాముసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

Trump removes Anthony Scaramucci from communications director role

కాగా, శ్వేతసౌధం కొత్త చీఫ్ ఆఫ్ స్టాఫ్‌గా జాన్ కెల్లి బాధ్యతలు చేపట్టిన రోజునే ట్రంప్ స్కారాముసిని తొలగించడం గమనార్హం. కెల్లీ కూడా స్కారాముసి తొలగింపు నిర్ణయాన్ని స్వాగతించారు. సోమవారం స్కారాముసిని తన కార్యాలయానికి పిలిపించుకుని మాట్లాడిన ట్రంప్.. ఆయనపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+