Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

భారత్‌ ఎకానమీని దొంగదెబ్బ కొట్టిన ట్రంప్- ఊపిరాడనివ్వట్లేదు: డ్రాస్టిక్ ఫాల్

Indian Rupee: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో సంచలనానికి తెర తీశారు. అక్రమ వలసలను ఉక్కుపాదంతో అణచివేయడానికి శ్రీకారం చుట్టారు. ఈ క్రమంలో మూడు దేశాలపై కొరడా ఝుళిపించారు. భారీగా టారిఫ్ విధించారు. దీనికి సంబంధించిన ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు ట్రంప్.

ట్రంప్ టారిఫ్‌ను ఎదుర్కొంటోన్న దేశాల్లో కెనడా, మెక్సికో, చైనా ఉన్నాయి. ఈ మూడు దేశాలపైనా విధించిన సరికొత్త టారిఫ్ తక్షణమే అమలులోకి వచ్చేలా ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మూడు దేశాల నుంచి అమెరికాకు దిగుమతి అయ్యే అన్ని రకాల వాహనాలు, వస్తువులు, సరుకులు, ఆహార పదార్థాలపై కొత్త టారిఫ్‌కు అనుగుణంగా డ్యూటీని వసూలు చేస్తారు.

Trump Tariff Rupee hits record low of 87 29 against USD

ఈ మూడింట్లో మెక్సికోపై అత్యధికంగా టారిఫ్ భారం పడింది. 25 శాతం టారిఫ్‌ను అదనంగా చెల్లించాల్సి ఉంటుందా దేశానికి. కెనడా, చైనాలపై 10 శాతం మేర టారిఫ్‌ను విధించింది అమెరికా. ఈ కొత్త టారిఫ్- ట్రేడ్ వార్‌కు దారి తీసింది. ఈ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై డొనాల్డ్ ట్రంప్ సంతకం చేసిన కొద్దిసేపటికే కెనడా, మెక్సికో, చైనా ఘాటుగా స్పందించాయి. తిరుగుబాటు మొదలుపెట్టాయి.

ఇది- భారత ఆర్థిక వ్యవస్థపై తీవ్రంగా పడింది. ఈ ట్రేడ్ వార్ దెబ్బకు భారత రూపాయి విలువ అత్యంత దారుణంగా పడిపోయింది. గతంలో ఎప్పుడూ లేనంతంగా క్షీణించింది. ఈ ఉదయం అంతర్జాతీయ మార్కెట్‌లో డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి విలువ ఏకంగా రూ. 87.29 పైసలకు క్షీణించింది. ఇది రికార్డు స్థాయి పతనం. గతంలో ఎప్పుడూ ఈ రేంజ్‌లో రూపాయి విలువ దిగజారిపోలేదు.

రూపాయి విలువ ఈ స్థాయిలో పతనం కావడంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రంగంలోకి దిగింది. తక్షణ దిద్దుబాటు చర్యలను చేపట్టింది. దీనితో కొద్దిగా కోలుకోగలిగిందంతే. రూ. 87.13 పైసల వద్ద నిలిచింది. రూపాయి విలువ ఈ స్థాయిలో పడిపోవడానికి ప్రధాన కారణం- ట్రంప్ విధించిన సరికొత్త టారిఫేనని కరెన్సీ ఎక్స్‌‌పర్ట్ కేఎన్ డే తెలిపారు.

భారత్ సహా బ్రిక్స్ సభ్య దేశాలకు డొనాల్డ్ ట్రంప్ ఇదివరకే టారిఫ్ హెచ్చరికలను ఇచ్చిన నేపథ్యంలో మున్ముందు రూపాయి విలువ మరింత దిగజారే ప్రమాదం లేకపోలేదని అన్నారు. ఏ క్షణమైనా ట్రంప్ బ్రిక్స్ సభ్య దేశాలపై కొత్త టారిఫ్ విధించే అవకాశాలు లేకపోలేదని, మార్కెట్ పట్ల అప్రమత్తంగా ఉండక తప్పదని చెప్పారు.

ట్రంప్ టారిఫ్ దుష్ప్రభావం ఒక్క రూపాయి మీదే కాదు.. అటు కెనడా డాలర్, మెక్సికో కరెన్సీ పెసొ, చైనాకు చెందిన యువాన్‌పైనా తీవ్రంగా పడింది. ప్రత్యేకించి- డాలర్‌తో పోల్చుకుంటే మెక్సికన్ పెసొ విలువ దారుణంగా పడిపోయింది.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+