ఇక నుంచి ఆ వ్యవహారమంతా 'సీక్రెట్': ట్రంప్ మరో షాకింగ్ నిర్ణయం..
జాతీయ భద్రతా, స్వేచ్ఛా భంగం కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వైట్ హౌజ్ వర్గాలు అంటున్నాయి.
వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మరో మొండి నిర్ణయం తీసుకున్నారు. ఇకనుంచి వైట్ హౌజ్ ను సందర్శించే వారి వివరాలు బహిర్గతం చేసేది లేదని స్పష్టం చేశారు. అత్యవసరమైతే తప్ప, ట్రంప్ ఐదేళ్ల పాలన ముగిసేవరకు ఈ వివరాలు బయటకు వెల్లడించేది లేదని తేల్చి చెప్పారు.
ఈ మేరకు శుక్రవారం నాడు అమెరికా వైట్ హౌజ్ వర్గాల నుంచి ప్రకటన వెలువడింది. కాగా, దేశ అధ్యక్షుడిగా ఆయన్ను ఎవరెవరు కలుస్తున్నారో తెలుసుకునేందుకు వీలుగా గతంలో ఒబామా ప్రభుత్వం ఈ వివరాలను స్వచ్చందంగా వెల్లడించేది. ట్రంప్ మాత్రం జాతీయ భద్రతా రీత్యా వైట్ హౌజ్ సందర్శకుల వివరాలను గోప్యంగా ఉంచాలని భావిస్తున్నారు.

జాతీయ భద్రతా, స్వేచ్ఛా భంగం కారణంగానే ఇలాంటి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని వైట్ హౌజ్ వర్గాలు అంటున్నాయి. ఈ కొత్త విధానానికి ట్రంప్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు వైట్ హౌజ్ ప్రతినిధులు తెలిపారు. ట్రంప్ పాలన ముగిశాకే వైట్ హౌజ్ సందర్శకుల వివరాలను వెల్లడిస్తామని, అప్పటిదాకా ఆ వివరాలు గోప్యంగానే ఉంటాయన్నారు.












Click it and Unblock the Notifications