రైల్లో స్త్రీకి పోర్న్ వీడియో చూపించిన టీటీ (వీడియో)
భోపాల్: వేగంగా వెళుతున్నరైలులో మహిళా ప్రయాణికుల దగ్గర అనుచితంగా ప్రవర్తించిన టిక్కెట్ కలెక్టర్ కటకటాలపాలైనాడు. మహిళా ప్రయాణికులు అతనికి బుద్ధి చెప్పి పోలీసులకు అప్పగించారు. పోలీసులు టీటీ మీద కేసు నమోదు చేశారు.
మధ్యప్రదేశ్ లో భోపాల్ నుండి వెళుతున్న రైలులో టిక్కెట్ కలెక్టర్ మహిళా ప్రయాణికుల దగ్గరకు వెళ్లాడు. వారి దగ్గర ఉన్న టిక్కెట్లు పరిశీలించాడు. తరువాత జేబులో ఉన్న అతని స్మార్ట్ ఫోన్ బయటకు తీశాడు. అందులో డౌన్ లోడ్ చేసి ఉన్న పోర్న్ వీడియోలు చూడటం మొదలు పెట్టాడు.

అంతటితో అతను ఆగలేదు. మహిళా ప్రయాణికుల దగ్గరకు వెళ్లాడు. తరువాత ఒక మహిళకు పోర్న్ వీడియోలు చూపించాడు. అతని చేష్టలకు విసిగి పోయిన మహిళలు టీటీకి బుద్ది చెప్పి దేహశుద్ది చేసి పోలీసులకు అప్పగించారు. సదరు టీటీ గారు ఊచలు లెక్కపెడుతున్నారు.












Click it and Unblock the Notifications