తమిళనాడు సీఎంగా కొత్త పేరు తెరమీదకు, కాలర్ ఎగరేస్తున్న టీటీవీ దినకరన్, పళని, పన్నీర్ !
తమిళనాడు సీఎంగా కొత్త పేరు తెరమీదకు తెచ్చిన టీటీవీ గ్యాంగ్ కాలర్ ఎగరేసుకు తిరుగుతున్న టీటీవీ దినకరన్, సీఎంకు చాలెంజ్ అయోమయంలో పన్నీర్ సెల్వం, పళనిసామి, డీఎంకే పక్కా స్కెచ్ !
చెన్నై: తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామిని పదవి నుంచి తప్పించే వరకు మేము నిద్రపోమని టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు చాలెంజ్ చేస్తున్నారు. అన్నాడీఎంకే ప్రభుత్వాన్ని మాత్రం మేము పడగొట్టమని టీటీవీ దినకరన్ వర్గం అంటోంది.
టీటీవీ దినకరన్ వర్గంలోని కొడుగు బెల్ట్ ఎమ్మెల్యేలు తమిళనాడు ముఖ్యమంత్రి అభ్యర్థి పేరును తెరమీదకు తీసుకు వచ్చారు. దళితుడు, శశికళ అనుచరుడు అని గుర్తింపు తెచ్చుకున్న తమిళనాడు స్పీకర్ దనపాల్ ను ముఖ్యమంత్రిని చేస్తామని టీటీవీ దినకరన్ వర్గం అంటోంది.

బుదవారం టీటీవీ దినకరన్ వర్గీయులు పుదుచ్చేరిలోని ద వైండ్ ప్లవర్ రిసార్ట్ స్పా లో బిజీబిజీగా మంతనాలు జరుపుతున్నారు. ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం మైనారిటీలో పడేసిన టీటీవీ దినకరన్ కాలర్ ఎగరేసుకుని తిరుగుతున్నారు. మొత్తం మీద టీటీవీ దినకరన్ వర్గంలోని ఎమ్మెల్యేలు పళనిసామి, పన్నీర్ సెల్వం ను పదవుల నుంచి తప్పిస్తామని చాలెంజ్ చేస్తున్నారు. మరో వైపు ప్రతిపక్షం అయిన డీఎంకే తమిళనాడు రాజకీయాల్లో చక్రం తిప్పాలని ప్రయత్నిస్తోంది.












Click it and Unblock the Notifications