వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆర్కే నగర్ బరిలో తలపడనున్న దినకరన్-దీప!?.. వ్యూహాల్లో పన్నీర్-శశికళ..

శశికళ వ్యూహం బాగానే ఉన్నా.. చిన్నమ్మే వద్దన్న వారు ఆమె అక్క కొడుకు ఆదరిస్తారా? అన్నది అనుమానమే.

|
Google Oneindia TeluguNews

చెన్నై: సీఎంగా పదవి బాధ్యతలు చేపట్టి.. అటు తర్వాత అమ్మ మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నుంచి పోటీ చేసి గెలవాలని చిన్నమ్మ శశికళ భావించారు. ఇంతలోనే ఎదురుతిరిగిన పరిణామాలతో జైల్లో కాలం గడుపుతున్నారు.

అయితే జయలలిత మరణంతో ఖాళీ అయిన ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి తన అక్క కొడుకు దినకరన్ ను బరిలో దించాలని శశికళ వ్యూహాం రచిస్తున్నట్లుగా తెలుస్తోంది. జైలు నుంచే సీఎం పళనిస్వామి చేత తన ఎత్తుగడలను అమలు చేయించాలని భావిస్తున్న శశికళ.. అందులో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.

కాగా, ఎవరైనా సిట్టింగ్ ఎమ్మెల్యే మరణిస్తే ఆరు నెలల్లోగా ఎన్నికలు నిర్వహించే ఆనవాయితీ కొనసాగుతూ వస్తుంది. ఈ లెక్కన అమ్మ మరణించి 2నెలలు పూర్తయిపోవడంతో ఇక మిగిలింది కేవలం నాలుగు నెలలు మాత్రమే. ఈ నేపథ్యంలోనే శశికళ చకచకా పావులు కదపాలని యోచిస్తున్న శశికళ.. ఆర్కేనగర్ నుంచి దినకరన్ ను బరిలో దింపాలనే ఆలోచనలో ఉన్నారు.

Ttv dinakaran likely to be contesting from rk nagar may from deepa contests panneers side

పళనిస్వామి మంత్రివర్గంలోను దినకరన్ కు చోటు దక్కుతుందని అంతా భావించినా.. ఎమ్మెల్యే కాని వ్యక్తికి మంత్రిపదవి కట్టబెట్టడం విమర్శలు కొనితెచ్చుకున్నట్లవుతుందని ఆ నిర్ణయాన్ని ఉపసంహరించుకున్నట్లు సమాచారం. ఒకవేళ ఆర్కేనగర్ నుంచి గనుక దినకరన్ విజయం సాధిస్తే అప్పుడు అతనికి కీలక మంత్రిపదవి కట్టబెట్టే అవకాశం ఉంది.

శశికళ వ్యూహం బాగానే ఉన్నా.. చిన్నమ్మే వద్దన్న వారు ఆమె అక్క కొడుకు ఆదరిస్తారా? అన్నది అనుమానమే. కాగా, ప్రస్తుతం దినకరన్ అన్నాడీఎంకె డిప్యూటీ జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.

దీపను బరిలో దించాలనుకుంటున్న పన్నీర్:

శశికళతో పోరులో పన్నీర్ సెల్వంకు మద్దతుగా నిలిచిన జయలలిత మేనకోడలు దీపజయకుమార్ ను పన్నీర్ సెల్వం వర్గం ఆర్కే నగర్ నియోజకవర్గం నుంచి బరిలో దింపాలని యోచిస్తోంది. ఆర్కేనగర్ వాసులకు శశికళ పట్ల వ్యతిరేకత ఉండటం.. అచ్చు అమ్మ పోలికలతోనే ఉన్న దీపకు ఆర్కేనగర్ ఎన్నికలో కలిసొస్తుందనేది పన్నీర్ ఆలోచన.

దీపజయకుమార్ ను ముందుపెట్టి రాజకీయం నెరిపితే.. పళనిస్వామి వర్గం నుంచి మరికొంతమంది ఎమ్మెల్యేలను తన చెంతకు చేర్చుకోవచ్చు అని పన్నీర్ భావిస్తున్నట్లు తెలుస్తోంది. అదే జరిగితే మద్దతు ఇవ్వడానికి ఎటూ డీఎంకె సిద్దంగా ఉంది కాబట్టి పన్నీర్ ఈ దిశగా అడుగులు వేస్తున్నట్లు చెప్పుకుంటున్నారు.

మొత్తం మీద దీప, దినకరన్ గనుక ఆర్కే నగర్ బరిలో నిలిస్తే ఉత్కంఠను రేపే పోరు మాత్రం ఖాయంగానే కనిపిస్తోంది. మరి ఇవన్నీ ఊహాగానాలకే పరిమితమవుతాయా? లేక కార్యరూపం దాలుస్తాయా? అన్నది వేచిచూడాలి.

English summary
It may chance that AIADMK Deputy general secretary Dinakar will contest in Rk Nagar. At the same time Jayalalithaas neice Deepa may also contest from there
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X