జయలలిత చికిత్స సీసీటీవీ క్లిప్పింగ్స్ విడుదల చేస్తాం: అయితే ఒక్క కండీషన్, డ్రామాలు !
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రికార్డు అయిన సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ విడుదల చెయ్యడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించి
బెంగళూరు: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రికార్డు అయిన సీసీటీవీ కెమెరాల క్లిప్పింగ్స్ విడుదల చెయ్యడానికి తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అన్నాడీఎంకే పార్టీ బహిష్కరించిన టీటీవీ దినకరన్ అన్నాడు.
శనివారం కర్ణాటకలోని కొడుగు రిసార్ట్ లో బస చేసిన తన మద్దతుదారులైన అనర్హత ఎమ్మెల్యేలను టీటీవీ దినకరన్ కలుసుకున్నారు. ఈ సందర్బంగా టీటీవీ దినకరన్ మీడియాతో మాట్లాడుతూ శశికళ అనుమతి ఇస్తే జయలలిత ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో రికార్డు అయిన సీసీకెమెరాల పుటేజీలు విడుదల చేస్తామని టీటీవీ దినకరన్ చెప్పాడు.

అనర్హులైన తన మద్దతుదారులు న్యాయస్థానంలో విజయం సాధిస్తారని, ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని అతి త్వరలో ఇంటికి పంపిస్తామని టీటీవీ దినకరన్ చాలెంజ్ చేశారు. ఎడప్పాడి పళనిసామి, పన్నీర్ సెల్వంను కచ్చితంగా అధికారం నుంచి తప్పిస్తామని టీటీవీ దినకరన్ ధీమా వ్యక్తం చేశారు.
తనపై విమర్శలు చేస్తున్న తమిళనాడు మంత్రి దిండుగల్ శ్రీనివాసన్ మీద టీటీవీ దినకరన్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. శశికళ కాళ్లు పట్టుకున్నందుకు అన్నాడీఎంకే పార్టీలో కీలక పదవి, మంత్రి పదవి శ్రీనివాసన్ కు వచ్చిందని, ఇప్పుడు మా మీద పాడుకూతలు కూస్తున్నాడని, అతనికి త్వరలో బుద్ధి చెబుతామని టీటీవీ దినకరన్ హెచ్చరించారు.












Click it and Unblock the Notifications