జయలలిత ఇంటి దగ్గర టీటీవీ దినకరన్ అనుచరుల హంగామా, అడ్డుకున్న పోలీసులు!
చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలితకు తాము ప్రత్యేక పూజలు చెయ్యాలని టీటీవీ దినకరన్ మద్దతుదారులు పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం దగ్గర నానాహంగామా చేశారు. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.
అన్నాడీఎంకే పార్టీ నుంచి బహిష్కరణకు గురైన టీటీవీ దినకరన్ మద్దతుదారులు, ఆయన గ్రూప్ లోని ఎమ్మెల్యే వెట్రివేల్ తదితరులు బుధవారం జయలలితకు చెందిన పోయెస్ గార్డెన్ లోని వేదనిలయం దగ్గరకు బయలుదేరారు. విషయం తెలుసుకున్న పోలీసులు భారీ సంఖ్యలో అక్కడికి చేరుకున్నారు.

వేదనిలయంలో అమ్మ జయలలితకు వేదపురోహిత పూజలు చెయ్యాలని ఎమ్మెల్యే వెట్రివేల్ తదితరులు పోలీసులకు చెప్పారు. వేదనిలయంలో అడుగు పెట్టడానికి వీలులేదని పోలీసులు తేల్చి చెప్పారు. ఆ సందర్బంలో వారి మధ్య వాగ్వివాదం జరిగింది.

అధిక సంఖ్యలో పోయెస్ గార్డెన్ చేరుకున్న పోలీసులు టీటీవీ దినకరన్ మద్దతుదారులను అడ్డుకున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి కావాలనే పోలీసులను రెచ్చగొట్టి మమ్మల్ని అడ్డుకున్నారని ఆరోపిస్తూ టీటీవీ మద్దతుదారులు పోయెస్ గార్డెన్ లో ధర్నా నిర్వహించారు.












Click it and Unblock the Notifications