వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హీరో విశాల్ కు గాలం వేసిన టీటీవీ దినకరన్: దూకుడు మీద మన్నార్ గుడి మాఫియా !

అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరించిన టీటీవీ దినకరన్ 23 మంది ఎమ్మెల్యేల మద్దతుకూడగట్టుకుని జోరుమీద ఉన్నారు.

|
Google Oneindia TeluguNews

చెన్నై: అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి పదవి నుంచి బహిష్కరించిన టీటీవీ దినకరన్ 23 మంది ఎమ్మెల్యేల మద్దతుకూడగట్టుకుని జోరుమీద ఉన్నారు. దినకరన్ దూకుడు పెంచి ప్రస్తుతం సినీ తారలను ఆకర్షించే పనిలో నిమగ్నం అయ్యారు.

పేరుకు మాత్రమే సీఎం వెంట ఎమ్మెల్యేలు: మావైపు 40 మంది వస్తారు: టీటీవీ దినకరన్ గ్యాంగ్ !పేరుకు మాత్రమే సీఎం వెంట ఎమ్మెల్యేలు: మావైపు 40 మంది వస్తారు: టీటీవీ దినకరన్ గ్యాంగ్ !

బహుబాష నటుడు, తమిళ సినీ నిర్మాతల సంఘం అధ్యక్షుడు, నడిగర్ సంఘం ప్రధాన కార్యదర్శి, హీరో విశాల్ ను కలిసిన టీటీవీ దినకరన్ మీరు రాజకీయాల్లోకి రావాలని, ప్రజలకు మంచి చెయ్యాలని ఆహ్వానించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశారు. సినీరంగంలో ప్రముఖుడు అయిన హీరో విశాల్ తన గూటిలో చేరితే ప్రజలను ఆకర్షించడానికి మరింత అవకాశం ఉంటుందని దినకరన్ ప్రయత్నాలు చేస్తున్నారు.

 TTV Dinakaran welcomed actor Vishal to politics.

బుధవారం చెన్నైలో హీరో విశాల్ ను కలిసిన టీటీవీ దినకరన్ పలు విషయాలపై చర్చించారు. విశాల్ తో ఫోటోలు దిగారు. దాదాపు గంట పాటు విశాల్, ఆయన కుటుంబ సభ్యులతో దినకరన్ చర్చించారు. రాజకీయాల్లోకి వచ్చే విషయంపై హీరో విశాల్ ఎలాంటి నిర్ణయం చెప్పలేదని తెలిసింది.

ఉప ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం అనర్హుడు: హై కోర్టులో పిటిషన్ !ఉప ముఖ్యమంత్రి పదవికి పన్నీర్ సెల్వం అనర్హుడు: హై కోర్టులో పిటిషన్ !

ఇప్పటికే టీటీవీ దినకరన్ తో బహుబాష నటి నమిత సన్నిహితంగా ఉన్న విషయం తెలిసిందే. తమిళ సినీరంగంలోని కొందరితో టీటీవీ దినకరన్ కు ఇప్పటికే సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఇప్పుడు కొత్తగా హీరో విశాల్ కు గాలం వేసిన టీటీవీ దినకరన్ ఇక ముందు దూకుడు ప్రదర్శించడానికి సిద్దం అయ్యారని తెలిసింది.

English summary
AIADMK Deputy Secretary TTV Dinakaran welcomed actor Vishal to politics.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X