దెబ్బకు దెయ్యం దిగింది: శశికళ కోసం జైలుకు దినకరన్ పరుగో పరుగు, ఏం చేద్దాం!
తమిళనాడు సీఎం ఎడప్పాడి పళనిసామి ఎదురుతిరిగి ప్రత్యర్థి పన్నీర్ సెల్వం వర్గంతో కలిసిపోవడానికి సిద్దం అయ్యారని తెలుసుకున్న టీటీవీ దినకరన్ బెంగళూరు జైల్లో ఉన్న శశికళతో చర్చించడానికి బయలుదేరి వెళ్లారు.
చెన్నై/బెంగళూరు: తమిళనాడు రాజకీయాలు రసవత్తరంగా మారడంతో ఇప్పుడు అన్నాడీఎంకే (అమ్మ) పార్టీలోని శశికళ వర్గం హడలిపోతుంది. ఎలాగైనా తమిళనాడులో ప్రభుత్వం కొనసాగించాలని ఎత్తులకు పై ఎత్తులు వెయ్యడానికి సిద్దం అయ్యారు.
ఇందులో భాగంగా అన్నాడీఎంకే పార్టీ ఉప ప్రధాన కార్యదర్శి టీటీవీ దినకరన్ చిన్నమ్మ శశికళతో చర్చించి తదుపరి చర్యలు తీసుకోవడానికి సిద్దం అయ్యారు. శశికళను కలవడానికి దినకరన్ తన అనుచరులతో కలిసి బెంగళూరు బయలుదేరారు.

అదే సమయంలో
అన్నాడీఎంకే పార్టీ, రెండాకుల చిహ్నం ఎవ్వరికి ఇవ్వాలని ఎన్నికల కమిషన్ తుది నిర్ణయం తీసుకునే సమయంలోనే టీటీవీ దినకరన్ బెంగళూరు వెళ్లి చిన్నమ్మ శశికళను కలవడానికి సిద్దం అయ్యారు. అసలు ఏం జరుగుతుందో అంటూ శశికళ వర్గీయులు ఆందోళన చెందుతున్నారు.

ఒత్తిడి తీసుకు వస్తున్న సీఎం పళనిసామి
హద్దు మీరి ప్రవర్థిస్తే మేము పన్నీర్ సెల్వం వర్గంతో చేరిపోతామని తమిళనాడు ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిసామి వర్గంలోని సీనియర్ మంత్రులు, ఎమ్మెల్యేలు ఆదివారం టీటీవీ దినకరన్ ను హెచ్చరించారని వెలుగు చూసింది.

విరక్తి చెంది
టీటీవీ దినకరన్ చేష్టలతో విరక్తి చెందిన ఎడప్పాడి పళనిసామి మంత్రి వర్గంలోని సీనియర్లు ఇక మా వల్లకాదు, ఉంటే వారైనా ఉండాలి, లేదా మేమైనా ఉండాలని తేల్చి చెప్పారని సమాచారం.

ఆయన విషయంలో రాజీ లేదు
దినకరన్ విషయంలో ఇక రాజీ ఉండదని అన్నాడీఎంకే పార్టీ సీనియర్ నేతలు ఎడప్పాడి పళనిసామికి కచ్చితంగా చెప్పి వెళ్లిపోవడంతో శశికళ వర్గీయులు షాక్ కు గురైనారని వెలుగు చూసింది.

సినిమా చూపిస్తారని భయంతో
అన్నాడీఎంకే పార్టీ రెబల్ నాయకుడు పన్నీర్ సెల్వంతో తాము జతకడుతామని హెచ్చరించిన ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వాన్ని కంట్రోల్ లో పెట్టుకోవడానికి దినకరన్ తీవ్రస్థాయిలో ప్రయత్నాలు చేశారు. అయితే అది సాధ్యం కాకపోవడంతో దినకరన్ ఇప్పుడు అయోమయంలో పడిపోయాడు.

చిన్నమ్మ నీవే కాపాడు
ఎడప్పాడి పళనిసామి ప్రభుత్వం ఎత్తుగడలు తెలుసుకున్న టీటీవీ దినకరన్ ఇప్పుడు నేరుగా బెంగళూరు నగర శివార్లలోని పరప్పన అగ్రహార జైల్లో ఉన్న శశికళతో సంప్రదించడానికి బయలుదేరారు. చిన్నమ్మతో మాట్లాడిన తరువాత ఓ నిర్ణయం తీసుకోవాలని దినకరన్ పక్కా ప్లాన్ వేసుకున్నాడని సమాచారం.

అధికారులు అనుమతి ఇస్తారా ?
శశికళను కలవడానికి బెంగళూరు పరప్పన అగ్రహార సెంట్రల్ జైలు అధికారులు అనుమతి ఇస్తారా ? అనే అనుమానం బయలుదేరింది. నియమాలను తుంగలో తొక్కిఎలాగైనా శశికళతో చర్చించి ఓ నిర్ణయం తీసుకోవాలని ప్లాన్ వేస్తున్న దినకరన్ చివరికి ఏం చేస్తారు ? అనే విషయం అన్నాడీఎంకే నాయకులకే అంతుపట్టడం లేదు.
-
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!! -
అలిపిరి నుంచిప్రత్యేకంగా 11 లేన్ల రహదారి- టోల్ గేట్ సమూల పునరుద్ధరణ? -
పసిడికి భారీ డిమాండ్: కుప్పలు తెప్పలుగా -
రైతులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్, పథకాలు ఇక నుంచి..!! -
సమ్మర్ లో ఈ హిల్ స్టేషన్ కు వెళ్తే.. మళ్లీ తిరిగి రావాలనిపించదు..! -
US Blockade: అమెరికాకు బిగ్ షాక్..! తేలిపోయిన హార్ముజ్ దిగ్బంధం..!












Click it and Unblock the Notifications