వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

'లైట్లు ఆపేసి ఆ పనిచేయండి.. ఖచ్చితంగా అదే అనుభూతి పొందగలరు'

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : బీహార్ లో మద్యపాన నిషేధం నేపథ్యంలో.. మందుబాబులకు ఓ మంచి చిట్కా చెప్పారు సీఎం నితీశ్ కుమార్. మందు మిస్ అయిపోతున్నామే అని బాధపడిపోతున్న మందుబాబులంతా ఇప్పుడాయన చెప్పిన రెమెడీని ఫాలో అయిపోవాల్సిందే.

ఇంతకీ ఆయనేం చెప్పారంటే.. చీకట్లో లైట్లు ఆపేసుకుని ఓ గ్లాసుడు జ్యూసును గుటుక్కుమనిపించామంటే.. అచ్చు మందు తాగిన ఫీలింగే కలుగుతుందంట. తద్వారా మద్యానికి దూరంగా ఉండవచ్చునని సలహా ఇచ్చారు నితీశ్. రాష్ట్రంలో మద్యపానం నిషేధం అమలు చేసిన తర్వాత మునుపెన్నడూ లేనంత ఆత్మసంతృప్తి కలుగుతోందని చెప్పారు నితీశ్.

nitish

ఎన్నికల్లో హామిల్లో భాగంగా.. మద్యపాన నిషేధ హామిని నిలబెట్టుకుంది నితీశ్ సర్కార్. తొలుత పాక్షికంగా మద్య నిషేధం అమలు చేసిన నితీశ్ సర్కార్, ఆ తర్వాత ఈ ఏడాది ఏప్రిల్ నుంచి పూర్తి స్థాయిలో మద్యంపై నిషేధం విధించారు. నిబంధనలు బేఖాతరు చేసేవాళ్లకు బెయిల్ కూడా వచ్చే పరిస్థితి లేకుండా కఠిన చర్యలు తీసుకునేలా చట్టం రూపొందించారు. ఎవరైనా అక్రమ మద్యం దందాకు తెరలేపినా.. వాళ్లపై దాడులు జరుగుతున్న సంగతి తెలిసిందే.

ఏదేమైనా ఇప్పుడు చర్చంతా.. నితీశ్ చెప్పిన మద్యం చిట్కా పైనే. మందుబాబులంతా ఇక లైట్లు ఆపేసుకుని జ్యూస్ లు తాగుతూ.. మద్యం తాగుతోన్న అనుభూతిని ఆస్వాదించాల్సిందే.

English summary
"Such big positive change has come in, why ruin it for a peg or two? Turn off the lights and drink juice, you will feel its the same," Nitish was quoted
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X