• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

జ్ఞాపక శక్తి పెరుగుతుందని విద్యార్థులకు ఆ ఇంజెక్షన్లు... ట్యూటర్‌ అరెస్ట్...

|

ఢిల్లీలో ఓ విచిత్ర ఘటన వెలుగుచూసింది. సెలైన్ సొల్యూషన్ ఇంజెక్షన్ ద్వారా జ్ఞాపక శక్తి పెరుగుతుందని... విద్యార్థులకు ఆ ఇంజెక్షన్ ఇస్తున్న ఓ ట్యూటర్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఓ విద్యార్థి తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అతన్ని అదుపులోకి తీసుకున్నారు.

పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం... ఈస్ట్ ఢిల్లీలోని మందవల్లి పోలీస్ స్టేషన్ జరిధిలో నివాసముండే సందీప్ అనే బీఏ విద్యార్థి ఆరో తరగతి నుంచి 9 తరగతి వరకూ ట్యూషన్లు చెప్తున్నాడు. అతని వద్ద ట్యూషన్ కోసం వచ్చే విద్యార్థులకు ఇటీవల అతను ఏవో ఇంజెక్షన్లు ఇస్తున్నట్లు విద్యార్థు తల్లిదండ్రులకు తెలిసింది.

 Tutor arrested for giving injections to students to improve memory

ఈ నేపథ్యంలో ఓ విద్యార్థి తండ్రి దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో పోలీసులు సందీప్‌ను అదుపులోకి తీసుకుని విచారించారు. జ్ఞాపక శక్తి పెరిగేందుకు విద్యార్థులకు సెలైన్ సొల్యూషన్‌ను ఇంజెక్షన్ ద్వారా ఇచ్చినట్లు విచారణలో సందీప్ విచారణలో వెల్లడించాడు. యూట్యూబ్‌లో చూసి ఈ విషయం తెలుసుకున్నానని... ఇలా చేస్తే జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పాడు. సందీప్‌పై ఐపీసీ సెక్షన్ 336 కింద కేసు నమోదు చేసిన పోలీసులు ప్రస్తుతం దర్యాప్తు జరుపుతున్నారు. ఇంజెక్షన్లు తీసుకున్న విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు.

English summary
A 20-year-old tutor has been arrested by Delhi Police for administering NS solution to his students through injections. The police arrested the accused Sandeep, a BA 2nd year student who gives free classes to students of classes 6 to 9 in east Delhi's Mandawali.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X