ట్యూషనుకు వెళితే.. ట్యూటర్ తాకరాని చోట తాకుతూ..

ట్యూషన్ కు వెళ్లిన పదిహేనేళ్ల అమ్మాయిని ట్యూటరే తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించిన ఘటన ముంబయి నగరంలో జరిగింది. ఈ విషయం పోలీసుల వరకు వెళ్లడంతో ఆ కీచక ట్యూటర్ కటకటాలపాలయ్యాడు.

ముంబై : ట్యూషన్ కు వెళ్లిన పదిహేనేళ్ల అమ్మాయిని ట్యూటరే లైంగికంగా వేధించిన ఘటన ముంబయి నగరంలో జరిగింది. ముంబయి నగరానికి చెందిన తుషార్ అనే యువకుడు ఘన్సోలీలో సెక్టార్ 5లో ముక్తా కోచింగ్ కేంద్రాన్ని నిర్వహిస్తున్నాడు.

తన ట్యూషన్ సెంటరుకు వస్తున్న ఓ అమ్మాయి(15)ని తుషార్ తాకరాని చోట తాకుతూ లైంగికంగా వేధించాడు. అతడి లైంగిక వేధింపుల గురించి ఆ అమ్మాయి తన తల్లిదండ్రులకు చెప్పింది. అతడు ఇతర బాలికలను కూడా ఇలాగే వేధిస్తున్నాడని ఆరోపించింది.

Tutor held for Molesting Girl Student

దీంతో వారు కుమార్తెతో కలిసి వెళ్లి ఘన్సోలీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కీచక ట్యూటర్ తుషార్ ను అరెస్టు చేసి, అతడిపై ఐపీసీ 506, సెక్షన్ 8, పోస్కో చట్టాల కింద కేసు నమోదు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+