Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ డెత్ ప్రకంపనలు తగ్గకముందే.. మరో నటుడు ఆత్మహత్య: నో సూసైడ్ నోట్

ముంబై: బాలీవుడ్ స్టార్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య చేసుకున్న సంఘటన వల్ల చోటు చేసుకున్న ప్రకంపనలు తగ్గట్లేదు. ఈ ఆత్మహత్య ఉదంతం రోజుకో మలుపు తిరుగుతోంది. రెండు రాష్ట్రాల పోలీసుల మధ్య విభేదాలకు తావిచ్చింది. ఆ కేసును వెనుక గల కారణాలను వెలికి తీయడానికి, రహస్యాన్ని ఛేదించడానికి చివరికి- సీబీఐ రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ ఘటన కేసు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మరో నటుడు ఆత్మహత్య చేసుకున్నారు.

ప్రముఖ హిందీ టీవీ సీరియళ్ల నటుడు కమ్ మోడల్ సమీర్ శర్మ బలవన్మరణానికి పాల్పడ్డారు. చాలా కాలంగా ఆయన ముంబై మలద్ వెస్ట్ అహింసా రోడ్ ప్రాంతంలోని నేహా సీహెచ్‌ఎస్ అపార్ట్‌మెంట్‌లో ఆయన నివసిస్తున్నారు. తన నివాసంలో ఆయన ఆత్మహత్య చేసుకున్నారు. వంటగదిలో ఉరి వేసుకున్న స్థితిలో ఉన్న సమీర్ శర్మ మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం మలద్ ఆసుపత్రికి తరలించారు. నైట్ డ్యూటీ వాచ్‌మెన్ మొదటగా సమీర్ శర్మ మృతదేహాన్ని చూశారు. వెంటనే మలద్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.

TV actor and Model Sameer Sharma allegedly committed suicide in Mumbai

సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. సమీర్ శర్మ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేశారు. సమీర్ శర్మ మృతదేహం నుంచి దుర్వాసన వస్తుండటంతో.. కనీసం 48 గంటల కిందట ఆయన ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. టీవీ సీరియళ్లలో నటించి, దేశవ్యాప్తంగా జనాదరణ పొందిన సమీర్ శర్మ బలవన్మరణానికి పాల్పడటానికి గల కారణాలపై పోలీసులు ఆరా తీస్తున్నారు.

Recommended Video

    Sushant Singh Rajput సూసైడ్ కారణంగా Bollywood Offers, Karan Johar ని దూరం పెట్టిన Prabhas

    సంఘటనా స్థలం నుంచి ఎలాంటి సూసైడ్ నోట్ లభించలేదని ఇన్‌స్పెక్టర్ జార్జ్ ఫెర్నాండెజ్ తెలిపారు. యే రిష్తే హై ప్యార్‌ కే, ఘర్ ఘర్ కీ కహానీ, లెఫ్ట్ రైట్ లెఫ్ట్, ఇస్ ప్యార్ కో క్యా నామ్ దూ, ఏక్ బార్ ఫిర్, జ్యోతి వంటి టీవీ సీరియళ్లలో నటించారు. ఆయా సీరియళ్లన్నీ దాదాపు సూపర్‌హిట్‌ అయినవే. టీవీ సీరియళ్లతో పాటు సమీర్ శర్మ మోడల్‌గా కనిపించారు. కొన్ని టాప్ బ్రాండ్స్ అడ్వర్టయిజ్‌మెంట్లలో నటించారు. ఆయనకు ఆర్థికంగా ఎలాంటి ఇబ్బందులు లేవని ప్రాథమికంగా నిర్దారించారు. ఆత్మహత్యకు పాల్పడటానికి గల కారణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తామని జార్జ్ ఫెర్నాండెజ్ చెప్పారు.

    More From
    Prev
    Next
    Notifications
    Settings
    Clear Notifications
    Notifications
    Use the toggle to switch on notifications
    • Block for 8 hours
    • Block for 12 hours
    • Block for 24 hours
    • Don't block
    Gender
    Select your Gender
    • Male
    • Female
    • Others
    Age
    Select your Age Range
    • Under 18
    • 18 to 25
    • 26 to 35
    • 36 to 45
    • 45 to 55
    • 55+