లేడీ ఫ్యాషన్ డిజైనర్‌పై నటుడి అత్యాచారం, అరెస్టు
టీవీ సీరియళ్లలో మోడలింగ్‌లో అవకాశాలిప్పిస్తామని ఆశ పెట్టి 23 ఏళ్ల లేడీ ఫ్యాషన్ డిజైనర్ పై టీవీ నటుడు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘగటన ముంబై నగరంలోని వెర్సోవా ప్రాంతంలో జరిగింది.
ముంబై : టీవీ సీరియళ్లలో మోడలింగ్‌లో అవకాశాలిప్పిస్తామని ఆశ పెట్టి 23 ఏళ్ల లేడీ ఫ్యాషన్ డిజైనర్ పై టీవీ నటుడు అత్యాచారం చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ సంఘగటన ముంబై నగరంలోని వెర్సోవా ప్రాంతంలో జరిగింది. ప్రముఖ హిందీ టీవీ నటుడైన పీయూష్ సహదేవ్ (35) తనకు టీవీ సీరియళ్లు, మోడలింగ్ లో అవకాశాలిప్పిస్తానని చెప్పి తనపై అత్యాచారం చేశాడని ఫ్యాషన్ డిజైనర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
ఫ్యాషన్ డిజైనర్ ఫిర్యాదుపై తాము ఐపీసీ సెక్షన్ 376 (1) కింద కేసు నమోదు చేసి నిందితుడైన ప్రముఖ టీవీ నటుడు పీయూష్ సహదేవ్‌ను అరెస్టు చేసినట్లు సీనియర్ ఇన్ స్పెక్టరు కిరణ్ కాలే చెప్పారు.

పీయూష్ సహదేవ్ 'దేవన్ కీ దేవ్..మహదేవ్, సప్నే సుహానే లడక్ పన్ కే, బేహాద్, మీట్ మిలాదే రబ్బా, ఘర్ ఏక్ సప్నా, గీత్, మన్ కే అవాజ్ , హమ్ నే లీహై శపథ్ టీవీ షోలలో నటించాడు.
అయితే పీయూష్ సహదేవ్ ఆ ఫ్యాషన్ డిజైనర్‌తో రెండు నెలల పాటు సహజీవనం చేశాడని వార్తలు ప్రచారంలో ఉన్నాయి. నవంబర్ 20వ తేదీన యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అతనికి నవంబర్ 2వ తేదీ వరకు కస్టడీ విధించారు.












Click it and Unblock the Notifications