బీఫ్ బ్యాన్‌ను సమర్థించిన టీవీ నటుడిపై దాడి
తిరువనంతపురం: గోమాంసం నిషేధంపై కేరళ విద్యాసంస్థల్లో వివాదం ముదురుతోంది. బీఫ్ బ్యాన్‌ను సమర్ధించిన ఓ టీవీ నటుడుపై కొందరు విద్యార్థులు దాడి చేశారు. ఈ ఘటన కేరళలోని అలెప్పూ సమీపంలో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే.. అలెప్పూ సమీపంలోని ఒక కాలేజీ ఫంక్షన్‌కు వెళ్లి వస్తున్న టీవీ నటుడు, విశ్లేషకుడు అయిన రాహుల్ ఈశ్వర్‌పై కొంతమంది విద్యార్థులు చేయి చేసుకున్నారు. కాయంకులం ఎంఎస్ఎం కాలేజీ ఆవరణలో రాహుల్‌పై దాడిచేసిన విద్యార్థులు అతని కారును ధ్వంసం చేశారు.

శబరిమలై మతగురువు మనవడైన రాహుల్ పలు ప్రాంతీయ, జాతీయ టీవీ ఛానళ్లలో విమర్శకుడిగా తన వాదనలు వినిపిస్తుంటారు. ఈ క్రమంలో వివాదాస్పద అంశంగా మారిన బీఫ్ బ్యాన్‌ను సమర్ధిస్తూ జాతీయ మీడియా చర్చలో వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో కొందరు దుండగులు అతనిపై దాడి చేశారు. దాడికి పాల్పడిన 15 మంది విద్యార్థులపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా, రెండ్రోజుల క్రితం ఇదే అంశంపై రాష్ట్రంలోని మరో కాలేజీలో కూడా వివాదం చెలరేగింది.
క్యాంపస్‌లో గోమాంసంతో విందు చేసుకున్న విద్యార్థులపై కాలేజీ యాజమాన్యం క్రమశిక్షణ చర్యలు తీసుకుంది. యాజమాన్యం చర్యను ఖండించిన దీపా నిశాంత్ అనే మహిళా టీచర్ పైనా చర్యలు తీసుకుంది.
మరో ఘటనలో కొట్టాయంలోని ఓ కాలేజీలో దాద్రి ఘటనకు నిరసనగా బీఫ్ ఫెస్ట్ నిర్వహించిన కొందరు వామపక్ష విద్యార్థులపై సస్పెన్షన్ వేటు పడింది.
-
‘ఆ తప్పు వల్లే ప్రెగ్నెన్సీ.. తప్పక పెళ్లి చేసుకున్నా’ -
విజయ్ కు డిప్యూటీ సీఎం, 80 సీట్లు ఆఫర్? -
employees: ఉద్యోగులకు భారీ గుడ్ న్యూస్-ఒక్క దెబ్బకు డీఏ బకాయిలన్నీ క్లియర్..! -
సీఎం చంద్రబాబుకు అల్లు అర్జున్ క్షమాపణలు... పోస్ట్ వైరల్ !! -
ఉగాదికి ముందే వారి కల నెరవేరుస్తున్న చంద్రబాబు.. మాట నిలబెట్టుకున్నారుగా! -
డిప్యూటీ సీఎం ఆఫర్ వేళ విజయ్, బీజేపీకి అన్నాడీఎంకేేే బిగ్ షాక్..! -
మూడు ముక్కల్లో ఉస్తాద్ రివ్యూ ఇచ్చిన అన్నయ్య: ట్వీటు పెడితే హీటు పెరిగినట్టే -
Putta Mahesh: టీడీపీ నుంచి ఏలూరు ఎంపీ సస్పెన్షన్ - షర్మిల షాకింగ్ ..! -
పెన్షన్లు పెంపు, మహిళలకు నెలకు రూ 2,500 - అమలు ముహూర్తం..!! -
today rashiphalalu: నేడు మీన సంక్రాంతితో ఈ రాశులవారికి తిరుగులేని అదృష్టం! -
గ్యాస్ బుకింగ్, డెలివరీ ఇక నుంచి ఇలా చేస్తేనే - తాజా మార్గదర్శకాలు..!! -
ఉక్కిరిబిక్కిరి చేస్తోన్న బంగారం ధరలు












Click it and Unblock the Notifications