జ్యూస్‌లో డ్రగ్స్ టీవీ నటిపై జూనియర్ అర్టిస్ రేప్, పెళ్లాడమంటే..

ముంబై: సినీ పరిశ్రమలో తమకంటూ ఓ స్థానం సంపాదించుకోవాలని ఎన్నో కలలతో వచ్చే అమాయకులైన అమ్మాయిలను, మహిళలు కొందరి మాయమాటలు నమ్మి మోసపోతున్నారు. తాజాగా, అలాంటి ఘటనే ముంబైలో చోటు చేసుకుంది. అయితే, ఓ సీనియర్ నటి జూనియర్ ఆర్టిస్ట్ చేతిలో మోసపోవడం గమనార్హం.

వివరాల్లోకి వెళితే.. ముంబైలోని యమునా నగర్‌లో ఉన్న ఓ హోటల్ కు వినీత్ అనే జూనియర్ ఆర్టిస్ట్ అక్టోబర్ 13న రమ్మన్నాడని బాధితురాలు చెప్పింది. అక్కడకు వచ్చిన తనకు జ్యూస్ లో డ్రగ్స్ కలిపి ఇచ్చాడని, ఆ విషయం తెలియక తాను ఆ జ్యూస్ తాగానని చెప్పారు.

 TV actress says junior artiste drugged her, raped her and left her pregnant

కళ్లు తిరిగినట్లయి.. వినీత్ ఏం చెబితే అది చేశానని తెలిపింది. ఆ సమయంలో తనను అతడు లొంగదీసుకున్నాడని చెప్పింది. అయితే, తాను గర్బందాల్చే వరకు వినీత్ తనను రేప్ చేశాడన్న విషయం తనకు తెలియదని బాధితురాలు వెల్లడించింది.

గర్భవతి కావడంతో పెళ్లి చేసుకోమని వినీత్ ను కోరితు అతడు ముఖం చాటేశాడని వాపోయింది. సీరియల్స్ లో పనిచేస్తున్నప్పుడు వినీత్ తనకు పరిచయం అయ్యాడని తెలిపింది. ప్రస్తుతం పరారీలో ఉన్న వినీత్ కోసం పోలీసులు గాలింపు చేపట్టారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్నారు. కాగా, కహానీ ఘర్ ఘర్ కీ, నచ్ బలియే వంటి సీరియల్స్ లో బాధితురాలు నటించి మంచి గుర్తింపు తెచ్చుకోవడం గమనార్హం.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+