నటి.. ఆత్మహత్య: షూటింగ్ సెట్స్‌పైనే..!!

ముంబై: చలన చిత్ర పరిశ్రమలో దిగ్భ్రాంతికర సంఘటన చోటు చేసుకుంది. యువ నటి ఒకరు ఆత్మహత్య చేసుకున్నారు. షూటింగ్ సెట్స్‌పైనే ఆమె బలవన్మరణానికి పాల్పడ్డారు. ఆమె ఉరి వేసుకున్న విషయం తెలుసుకున్న యూనిట్- హుటాహుటిన ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచిందా నటి. ఈ విషయం తెలిసిన వెంటనే ఫిల్మ్ ఇండస్ట్రీ షాక్‌ కు గురైంది.

ఆ నటి పేరు తునీషా శర్మ. వయస్సు 20 సంవత్సరాలు. హిందీ బుల్లితెర నటి. పలు సీరియళ్లల్లో నటించారు. భారత్ కా వీర్ పుత్ర్- మహారాణా ప్రతాప్ తో అరంగేట్రం చేశారు. చక్రవర్తి అశోక సామ్రాట్, గబ్బర్ పూంఛ్ వాలా, షేర్-ఎ-పంజాబ్: మహారాజా రంజిత్ సింగ్, ఇంటర్‌నెట్ వాలా లవ్, ఇష్క్ సుభాన్ అల్లా వంటి పలు షోల్లో మెరిశారు.

TV actror Tunisha Sharma died by suicide at the age of 20, She ended her life on the set of her show

కత్రినా కైఫ్ లీడ్ క్యారెక్టర్‌లో నటించిన ఫితూర్, బార్ బార్ దేఖో వంటి బాలీవుడ్ సినిమాల్లోనూ నటించారు. విద్యాబాలన్ నటించిన కహానీ సీక్వెల్ కహానీ 2: దుర్గా రాణి సింగ్‌ లో మిన్నీ సిన్హా పాత్రలో ఫుల్ లెంగ్త్ రోల్ చేశారు. బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ సూపర్ హిట్ మూవీ దబాంగ్ 3లో ప్రాధాన్యత ఉన్న పాత్రను పోషించారు తునీషా శర్మ.

అలీబాబా: దాస్తాన్-ఆ-కాబుల్ సీరియల్‌ లో నటిస్తోన్నారు. ఇందులో షెహజాదీ మరియం పాత్రను పోషిస్తోన్నారు. సీరియల్ సెట్స్ మీదే ఆమె ఆత్మహత్య చేసుకున్నారు. ఉరి వేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డారు. నయీగావ్ లో షూటింగ్ కొనసాగుతున్న సమయంలో మేకప్ రూమ్ లో తునీషా శర్మ ఉరి వేసుకున్నారు. నిర్జీవంగా వేలాడుతున్న తునీషా శర్మను తొలుత ఆమె అసిస్టెంట్స్ చూశారు. యూనిట్ ను అప్రమత్తం చేశారు. అప్పటికప్పుడు ముంబైలోని ఆసుపత్రికి తరలించగా.. అక్కడ చికిత్స పొందుతూ మరణించారు.

తునీషా శర్మకు ఎలాంటి ఆర్థిక ఇబ్బందులు లేవని తెలుస్తోంది. ఆమె ఎందుకు ఆత్మహత్య చేసుకున్నారనే విషయం ఇంకా తెలియరావట్లేదు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు ఆసుపత్రికి చేరుకున్నారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. పోస్ట్‌మార్టమ్ కోసం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అన్ని కోణాల్లోనూ దర్యాప్తు సాగుతుందని వివరించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+