టీవీ జర్నలిస్టు ఆత్మహత్య: భార్య వద్దకు వెళ్లొచ్చి..

బెంగళూర్: కర్ణాటక రాజధాని బెంగళూర్‌లో 29 ఏల్ల టీవి జర్నలిస్టు ఆత్మహత్య చేసుకున్నాడు. సంజయ్‌నగర్‌లోని తన నివాసంలో సీలింగ్ ఫ్యాన్‌కు ఉరేసుకుని అతను మరణించాడు. ఈ విషాద ఘటన శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది.

సంజయ్ లధిమత్ అనే ఆ జర్నలిస్టు నగరంలోని ఓ టీవీ చానెల్‌లో కాపీ ఎడిటర్‌గా పని చేస్తున్నాడు. ఇటీవలే అతనికి వివాహమైంది. తన భార్యతో కలిసి అతను అద్దె ఇంట్లో ఉంటున్నాడు. తన భార్యను కలవడానికి సంజయ్ బాదామీ వెళ్లి శుక్రవారం రాత్రి తిరిగి వచ్చినట్లు పోలీసులు తెలిపారు.

 TV journalist hangs himself

శనివారం ఉదయం భార్య అతనికి ఫోన్ చేసింది. అయితే, ఏ విధమైన సమాధానం రాలేదు. దీంతో ఆమె తన పొరుగున ఉంటున్న శాంతికి ఫోన్ చేసి వాకబు చేయాలని అడిగింది. శాంతి తలుపు ఎంతగా తట్టినప్పటికీ లోపలి నుంచి స్పందన రాలేదు. దీంతో శాంతి పోలీసులకు సమాచారం ఇచ్చింది. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూశారు. సీలింగ్ ఫ్యాన్‌కు వేలాడుతున్న సంజయ్‌ను పోలీసులు చూశారు.

సూసైడ్ నోట్ ఏదైనా రాశాడా అని పోలీసులు గాలించారు. అయితే, అటువంటిదేమీ కనిపించలేదు. సంజయ్ సహోద్యోగులను, బంధువులను ప్రశ్నించారు. సంజయ్ చాలా సంతోషంగా ఉండేవాడని, ఆత్మహత్య చేసుకోవాల్సిన అవసరం ఏదీ లేదని సహోద్యోగులు చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+