టీవీకే అధినేత విజయ్ కు షాక్, విడాకులు కావాలంటూ కోర్టుకు భార్య
కోలీవుడ్ దళపతి, తమిళగ వెట్రి కళగం (TVK) అధినేత విజయ్ వ్యక్తిగత జీవితం ఇప్పుడు టెన్షన్ పీక్స్‌కు చేరింది. గత కొన్నేళ్లుగా సోషల్ మీడియాలో వినిపిస్తున్న ప్రచారమే నిజమై.. అది ఇప్పుడు కోర్టు మెట్లు ఎక్కింది. దాదాపు 27 ఏళ్ల వైవాహిక బంధానికి స్వస్తి పలుకుతూ విజయ్ సతీమణి సంగీత విడాకుల పిటిషన్ దాఖలు చేయడం కోలీవుడ్ నుంచి పొలిటికల్ వర్గాల వరకు పెను ప్రకంపనలు సృష్టిస్తోంది.
1999లో ప్రేమించి పెళ్లి చేసుకున్న ఈ జంట జీవితం 2021 వరకు సాఫీగానే సాగింది. కానీ, 2021 ఏప్రిల్‌లో విజయ్‌కు ఓ నటితో ఉన్న వివాహేతర సంబంధం గురించి తెలిసి సంగీత ఒక్కసారిగా కుప్పకూలిపోయింది. ఆ నటితో సంబంధాన్ని తెంచుకుంటానని సంగీతకు హామీ ఇచ్చిన విజయ్, ఆ తర్వాత ఆమెను నమ్మించి వంచించారని పిటిషన్‌లో ఆరోపించారు.

ఆ నటితో బంధాన్ని కొనసాగించడమే కాకుండా, తనను దూరం పెట్టడం ప్రారంభించారని సంగీత ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమలోనే కోర్టులో 12 పేజీలతో విడాకుల పిటిషన్ దాఖలు చేశారు. ప్రత్యేక వివాహ చట్టంలోని సెక్షన్ 27(1)(a) మరియు 27(1)(d) కింద సంగీత విడాకులు కోరారు. ఈ సెక్షన్లు ప్రధానంగా భాగస్వామి యొక్క వివాహేతర సంబంధం మరియు శారీరక లేదా మానసిక క్రూరత్వాన్ని సూచిస్తాయి. విజయ్ కుమారుడు జాసన్ సంజయ్, కుమార్తె దివ్యా షాషా ఉన్నారు. జాసన్ ప్రస్తుతం డైరెక్టర్‌గా ప్రూవ్ చేసుకోనే పనిలో నిమగ్నమయ్యారు.
విశ్వాసఘాతుకం.. ఆర్థిక ఆంక్షలు!
భర్తను నిలదీసినందుకు తనకు దక్కిన బహుమానం 'ఆర్థిక ఆంక్షలు' అని సంగీత పేర్కొన్నారు. విజయ్ తనపై కఠినమైన ఆర్థిక పరిమితులు విధించారని, మాటలతో పదేపదే అవమానించారని ఆమె తన పిటిషన్‌లో వివరించారు. పిల్లల భవిష్యత్తు కోసం ఇన్నాళ్లూ మౌనంగా భరిస్తూ వచ్చినప్పటికీ, విజయ్ ఆ నటితో బహిరంగంగా విదేశాలకు వెళ్లడం, ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నా మౌనంగా ఉండటం తనను తీవ్ర అవమానానికి గురిచేసిందని ఆమె వాపోయారు.
ఆ నటి ఎవరు? అసలు చిక్కుముడి అక్కడే..
సంగీత తన పిటిషన్‌లో సదరు నటి పేరును ప్రస్తుతం బయటపెట్టడానికి నిరాకరించారు. అయితే, ఒకవేళ విజయ్ చర్చలకు సహకరించకుండా ఒత్తిడి పెంచితే.. సదరు నటితో విజయ్‌కు ఉన్న అక్రమ సంబంధానికి సంబంధించిన పక్కా ఆధారాలను కోర్టు ముందు ఉంచుతానని హెచ్చరించడం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది. విడాకుల కోసం తాను చేసిన ప్రయత్నాలకు, చర్చలకు విజయ్ ఏమాత్రం సహకరించలేదని, అందుకే కోర్టును ఆశ్రయించడం తప్ప మరో మార్గం లేకపోయిందని ఆమె స్పష్టం చేశారు.
ఏప్రిల్ 20న క్లైమాక్స్?
సంగీత దాఖలు చేసిన ఈ పిటిషన్ మార్చి 20న చెంగల్పట్టు కుటుంబ సంక్షేమ న్యాయస్థానంలో విచారణకు రానుంది. ఆ రోజు విజయ్, సంగీత ఇద్దరూ వ్యక్తిగతంగా హాజరయ్యే అవకాశం ఉంది. ఈ కేసును అత్యంత సున్నితమైనదిగా పరిగణించి, ప్రత్యేక గదిలో (In-camera proceedings) విచారించాలని సంగీత కోర్టును కోరారు. ఒకవైపు రాజకీయాల్లో అడుగుపెట్టి అధికారం దిశగా అడుగులు వేస్తున్న విజయ్‌కు, ఈ విడాకుల వ్యవహారం వ్యక్తిగతంగానే కాకుండా రాజకీయంగా కూడా పెద్ద సవాలుగా మారేలా కనిపిస్తోంది.
-
కేంద్రానికి సీఎం స్టాలిన్ సీరియస్ వార్నింగ్! -
Tamil Nadu Polls: దక్షిణాది పీక నొక్కేస్తారా ? నిప్పులుచెరిగిన విజయ్..! -
సామాన్యులకు బిగ్ షాక్..! పెరగనున్న ధరలు.. దేశంలోనే తెలంగాణ టాప్..! -
విజయ్ను భయపెట్టిన అభిమాని.. సైకిల్ ఆపి పరుగో పరుగు! వీడియో -
అన్నా - చెల్లి కాస్తా.. భార్యాభర్తలు అయ్యారుగా ??? -
ఏపీలో ఇంటర్ ఫలితాల విడుదలపై బోర్డు తాజా నిర్ణయం, మార్కుల్లో ఈ సారి కొత్తగా..!! -
West Bengal Survey: బీజేపీ అంతర్గత సర్వేలో షాకింగ్- ఎన్ని సీట్లో తెలుసా ? -
మూడు పండుగలకు రెగ్యులర్ గా మూడు ఉచిత సిలిండర్ల పంపిణీ + రూ.2,000 -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
ఇలా చేస్తే అమరావతి గొడవ క్లోజ్..! మావిగన్ వేళ చంద్రబాబుకు సాయిరెడ్డి ఐడియా..! -
Amaravati: సాయిరెడ్డి సలహాపై స్పందించిన టీడీపీ..! బహిరంగ లేఖ..! -
ఆర్టీసీ బస్సు ఛార్జీల్లో మార్పులు, కొత్త రేట్లు ఇలా..!!












Click it and Unblock the Notifications