TVK విజయ్ కీలక నిర్ణయం..!!

TVK Vijay: వచ్చే ఏడాది శాసనసభ ఎన్నికలను ఎదుర్కొనబోతోంది తమిళనాడు. ఈ నేపథ్యంలో ఇప్పటి నుంచే రాజకీయాలు వేడెక్కుతున్నాయి. ఈసారి ఎన్నికల బరిలో తమిళగ వెట్రి కజగం (TVK) అధినేత విజయ్ అడుగుపెడుతున్నందున అందరి దృష్టి ఆయనపైనే ఉంది. కరూర్ తొక్కిసలాటలో 41 మంది అభిమానుల ప్రాణాలు కోల్పోయిన ఉదంతం నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటోన్న ఆయన మళ్లీ రాజకీయంగా యాక్టివ్ అయ్యారు.

ఈ క్రమంలో కేంద్ర ఎన్నికల కమిషన్ కు లేఖ రాశారు. ఎన్నికల నిర్వహణపై సంబంధిత అధికారులు నిర్వహించే సంప్రదింపుల సమావేశాలకు తమనూ ఆహ్వానించాలని కోరారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ (SIR), శాసనసభ ఎన్నికల సలహా సమావేశాల్లో టీవీకేను నిరంతరం విస్మరిస్తున్నారని గుర్తు చేశారు. ఈ సమావేశాలకు తమను ఆహ్వానించాలని ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల కమిషన్ నిర్వహించే అన్ని సమావేశాలకు టీవీకేని తప్పనిసరిగా ఆహ్వానించాలని అన్నారు.

TVK Chief Vijay Urges Chief Election Commissioner for Fair Elections

ఇతర రాజకీయ పార్టీలకు ఇచ్చే ప్రాధాన్యతను టీవీకేకి కూడా కేంద్ర, రాష్ట్ర ఎన్నికల సంఘం ఇవ్వాలని విజయ్ స్పష్టం చేశారు. ఈ విషయంలో టీవీకే తరపున అత్యవసర జోక్యాన్ని కోరుతున్నామని కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్ కు విజ్ఞప్తి చేశారు. తమిళనాడు అంతటా టీవీకేకు స్పష్టమైన బలం ఉందని, అపూర్వమైన ప్రజాదరణ ఉందని పేర్కొన్నారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయబోతోందని చెప్పారు. ఇందులో ఎటువంటి మార్పు ఉండదని పేర్కొన్నారు.

గుర్తింపు ఉన్నా, లేక పోయినా, అన్ని రాజకీయ పార్టీలకు సమాన అవకాశాలు కల్పించడం రాజ్యాంగ ప్రాథమిక స్వరూపంలో భాగమని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం సర్కులర్లల్లో గానీ, ఇతర నోటిఫికేషన్లల్లో గానీ తమ పేరును ప్రస్తావించనప్పటికీ, సంప్రదింపుల సమావేశాల్లో టీవీకేని మినహాయించడం అసమానతను ఎత్తి చూపుతున్నట్లు కనిపిస్తోందని విజయ్ వ్యాఖ్యానించారు. ఎన్నికల కమిషనర్ కార్యాలయం నిర్వహించే సంప్రదింపుల సమావేశాలలో టీవీకేని చేర్చకపోవడం ఎన్నికల ప్రక్రియల పర్యవేక్షణలో ఒక ముఖ్యమైన ఓటర్ల విభాగాన్ని భాగస్వామ్యం నుంచి మినహాయించే పరిణామాలకు దారితీస్తుందని అన్నారు.

నిష్పక్షపాత ఎన్నికల ప్రక్రియను నిర్ధారించడంలో ఎన్నికల సంఘం ప్రయత్నాలకు టీవీకే పూర్తి సహకారం అందించడానికి సిద్ధంగా ఉందని విజయ్ హామీ ఇచ్చారు. ఈ ఎన్నికల విధానాన్ని మెరుగుపరిచే ఉమ్మడి లక్ష్యంతో ఎవరికీ నష్టం కలిగించని ఈ న్యాయమైన అభ్యర్థనను సానుకూలంగా పరిశీలించాలని కోరుతూ, భారత రాజ్యాంగంలోని అధికరణ 324 ప్రకారం మీ పర్యవేక్షక అధికారాల కింద, రాష్ట్ర ఎన్నికల సంఘం, ప్రధాన ఎన్నికల అధికారి, తమిళనాడు ప్రభుత్వానికి తగిన ఆదేశాలు ఇవ్వాలని అభ్యర్థించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+