కోట్లకు పడగెత్తిన విజయ్ రైట్ హ్యాండ్

త‌మిళ‌నాడు ఎన్నిక‌ల వేడి ప‌తాక స్థాయికి చేరుకుంటోంది. పోలింగ్ గ‌డువు స‌మీపిస్తోన్న కొద్దీ అక్క‌డి వాతావ‌ర‌ణం వేడెక్కుతోంది. సీట్లు, నియోజ‌క‌వ‌ర్గాల పంప‌కాల్లో ఆయా పార్టీల అగ్ర‌నేత‌లు తీరిక లేకుండా గ‌డుపుతున్నారు. డీఎంకే, అన్నా డీఎంకే, టీవీకే.. ఈ ఎన్నిక‌ల‌ను ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తీసుకున్నాయి. గెలిచి తీరాల‌నే ప‌ట్టుద‌ల‌తో ఉన్నాయి. దీనికి అనుగుణంగా వ్యూహ ప్ర‌తివ్యూహాల‌ను రూపొందించుకుంటోన్నాయి.

టీవీకే ప్రధాన కార్యదర్శి, చెన్నై విల్లవాక్కం అభ్యర్థి ఆధవ్ అర్జున సోమవారం నామినేషన వేశారు. ఈ సందర్భంగా ఆయన రిటర్నింగ్ అధికారికి అందజేసిన అఫిడవిట్ లో తన ఆస్తుల వివరాలను పొందుపరిచారు. 197.52 కోట్ల రూపాయల విలువ చేసే స్థిర, చరాస్తి ఉన్నట్లు ప్రకటించారు. అథవ్ అర్జున పేరు మీద 180.03 కోట్ల చరాస్తులు ఉన్నాయి. ఆయన భార్య డైసీ అర్జున పేరిట 162.14 కోట్ల ఆస్తులు ఉన్నాయి. 2024-25 ఆర్థిక సంవత్సరానికి అర్జున 11.10 కోట్లు, ఆయన భార్య రూ. 6.85 కోట్ల ఆదాయాన్ని ప్రకటించారు.

TVK Leader Aadhav Arjuna Reports Moveable and Immovable Assets totaling Rs 197 52 Cr Affidavit Shows

అర్జున వద్ద 1,691 గ్రాములు, భార్య పేరు మీద 2,225.62 గ్రాముల బంగారం ఉంది. వీటి విలువ వరుసగా రూ. 2.29 కోట్లు, భార్య వద్ద రూ. 3.01 కోట్లు. అవి కాకుండా డైసీ అర్జున వద్ద రూ. 60.27 లక్షల విలువ చేసే 24,109.34 గ్రాముల వెండి, 6.16 కోట్ల విలువైన వజ్రాభరణాలు కూడా ఉన్నాయి. అర్జున అరైజ్ కన్‌స్ట్రక్షన్స్, వాయిస్ ఆఫ్ కామన్స్ (ఎంటర్‌టైన్‌మెంట్, స్ట్రాటజిక్ కన్సల్టింగ్) వంటి పలు కంపెనీలలో రూ. 2.23 కోట్లు పెట్టుబడి పెట్టారు. ఆయన పేరు మీద నాలుగు వాహనాలున్నాయి. 63,332 విలువైన స్పోర్ట్స్ సైకిల్‌తో సహా.

స్థిరాస్తుల విషయానికొస్తే, అర్జునకు వ్యవసాయ భూమి లేదు. ఆయనకు 17.49 కోట్ల ప్రస్తుత మార్కెట్ విలువ కలిగిన నివాస స్థలం ఉంది. భార్య డైసీ అర్జునకు స్వీయార్జిత ఆస్తులు రూ. 56.43 కోట్లు కాగా, వారసత్వంగా వచ్చిన ఆస్తుల విలువ 26.78 కోట్లు. ఆమె భారతీ-ఎయిర్‌టెల్, హెచ్‌డిఎఫ్‌సి బ్యాంక్, జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ వంటి షేర్లలో 68.75 కోట్లు పెట్టుబడి పెట్టారు. లోన్ల విషయానికొస్తే, డైసీ అర్జున బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి 26.26 కోట్లు రుణాలు తీసుకోగా, ఆధవ్ అర్జునకు 1.88 కోట్ల రుణం ఉంది.

పార్టీ అభ్యర్థుల జాబితాను విజయ్ ఇటీవలే విడుదల చేసిన విషయం తెలిసిందే. ఆయన స్వయంగా ఈ ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. రెండు నియోజకవర్గాల నుంచి బరిలో దిగనున్నారు. ఇదివరకే వార్తలు వచ్చినట్లుగా పెరంబూర్ స్థానం నుంచి విజయ్ బరిలో దిగారు. అదే సమయంలో మరో నియోజకవర్గాన్ని కూడా ఎంచుకున్నారు. తిరుచిరాపల్లి ఈస్ట్ నుంచి కూడా ఆయన రేసులో నిల్చొన్నారు. పెరంబూర్ నుంచి నామినేషన్ సైతం దాఖలు చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+