ఆనందం పట్టలేక.. నిండు సభలో విజయ్ పై పాట పాడిన మహిళా ఎమ్మెల్యే: సిగ్గుతో మెలికలు తిరిగిన సీఎం
అసెంబ్లీ సమావేశాల సందర్భంగా తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ కీలక ప్రకటనలు చేశారు. రాష్ట్రంలోని శాసనసభ్యులందరికీ నూతనంగా కార్లను సమకూర్చనున్నట్లు తెలిపారు. ఆరోగ్యం, వైద్య విద్యను బలోపేతం చేసేలా నూతన పథకాలను ప్రకటించారు. సామాన్య ప్రజల కోసం ఓ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిని నిర్మించబోతోన్నట్లు ప్రకటించారు. అలాగే ప్రస్తుతం అమలులో ఉన్న హెల్త్ కవరేజీని కూడా భారీగా పెంచారు.
తమ తమ నియోజకవర్గాల్లో చురుగ్గా పర్యటించి, ప్రజల సమస్యలను పరిష్కరించాలనే ఉద్దేశంతో ప్రతి ఎమ్మెల్యేకు కూడా ఒక్కో కారును సమకూర్చుతామని, దీనికి అయ్యే ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని విజయ్ వెల్లడించారు. వాటి నిర్వహణ, డ్రైవర్ వేతనం, ఇంధన వ్యయం, అవసరమైన ఇతరత్రా ఆర్థిక సాయాన్ని కూడా తామే చెల్లిస్తామని చెప్పారు. దీనికోసం ఒక్కో ఎమ్మెల్యేకు ప్రతి నెలా 75,000 రూపాయల చొప్పున నిధులు కేటాయిస్తామని అన్నారు.

దీంతో పాటు, నియోజకవర్గాల పరిధిలోని ఎమ్మెల్యే కార్యాలయాల్లో ఓ అసిస్టెంట్ ను కూడా నియమించుకోవడానికి నెలకు మరో 25,000 రూపాయల భత్యాన్ని కూడా ప్రకటించారు విజయ్. ఈ కారును దుర్వినియోగం చేయకూడదని, నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికీ వెళ్లి స్థానికులను పలకరించాలని, వారి కష్టసుఖాలను అడిగి తెలుసుకోవాలని చెప్పారు. దీనివల్ల వారి సమస్యలను సత్వరమే పరిష్కరించడానికి వెసలుబాటు లభిస్తుందని వ్యాఖ్యానించారు.
విజయ్ ఈ ప్రకటన చేసిన వెంటనే టీవీకే, ఇతర మిత్రపక్షాల సభ్యులందరూ కూడా హర్షం వ్యక్తం చేశారు. బల్లలు చరుస్తూ, చప్పట్లు కొడుతూ దీన్ని స్వాగతించారు. అదే సమయంలో టీవీకే కే చెందిన మహిళా సభ్యురాలు కే సింధు.. ఆనందం పట్టలేకపోయారు. అప్పటికప్పుడు నిండు సభలో విజయ్ పై ఓ పాట పాడారు. ఆమె తన వంకే చూస్తూ ఈ పాట పాడేటప్పుడు విజయ్ సిగ్గుతో మెలికలు తిరగడం కనిపించింది.
#WATCH | Chennai | TVK MLA K Sindhu sings a song during the Tamil Nadu Assembly Session, thanking CM Vijay for his announcement of providing a government vehicle to MLAs
— ANI (@ANI) August 19, 2026
(Source: Tamil Nadu Assembly/YouTube) https://t.co/OZD4ovF5yW pic.twitter.com/wAufBwY3tV
సింధు.. గుడియాత్తం అసెంబ్లీ నియోజకవర్గానికి ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన ఆమె.. తన పేరు మీదే ఓ మ్యూజిక్ అండ్ డాన్స్ అకాడమీని నిర్వహిస్తోన్నారు. మొన్నటి ఎన్నికల్లో టీవీకే టికెట్ పై పోటీ చేసి 10,000లకు పైగా మెజారిటీ ఘన విజయం సాధించారు. తన సమీప ప్రత్యర్థి, డీఎండీకే అభ్యర్థి కే ప్రతాప్ ను ఓడించారు. ఇక్కడ డీఎంకే పోటీ చేయలేదు. తన మిత్రపక్షానికి ఈ సీటును కేటాయించింది.












Click it and Unblock the Notifications