మాటలు మాట్లాడితే సరిపోదు- విజయ్ సేతుపతికి టీవీకే అద్దిరిపోయే కౌంటర్
బిగ్ బాస్ తాజా ఎపిసోడ్‌పై తమిళనాడులో రాజకీయంగా విమర్శలు తలెత్తుతున్నాయి. షో హోస్ట్‌గా వ్యవహరిస్తోన్న ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి ఇటీవలే చేసిన వ్యాఖ్యల దుమారం ఇంకా తగ్గట్లేదు. నాయకత్వ లక్షణాలపై చేసిన విజయ్ సేతుపతి ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రజలకు హామీలు ఇచ్చి పారిపోవడం నిజమైన నాయకుడి లక్షణం కాదని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలు ముఖ్యమంత్రి విజయ్ ను ఉద్దేశించి చేశారనే ప్రచారం తమిళనాడులో వెల్లువెత్తుతున్నాయి.
విజయ్ సేతుపతి వ్యాఖ్యలపై తాజాగా టీవీకే ఎమ్మెల్యే కనిమొళి సంతోష్ ఘాటుగా స్పందించారు. వినోద కార్యక్రమాలకు సంబంధించిన వేదికలపై నిలబడి మాటలు మాట్లాడినంత మాత్రాన రాజకీయాల్లో ఎలాంటి మార్పులు సంభవించబోవని అన్నారు. ప్రజాస్వామ్య సమాజంలో ఎవరికైనా విమర్శలు చేసే స్వేచ్ఛ ఉంటుందని, అవి స్పష్టంగా, నిర్మాణాత్మకంగా ఉండాలని అన్నారు. తప్ప ఎవరి మెప్పుకోసమో మాట్లాడకూడదని హితవు పలికారు.

తన సొంత నియోజకవర్గం కోయంబత్తూరు జిల్లాలోని కవుండంపాలయంలో ఈ ఉదయం కనిమొళి సంతోష్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నూతన బస్సులను ప్రారంభించారు. అనంతరం విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా బిగ్ బాస్ వేదికగా విజయ్ సేతుపతి చేసిన వ్యాఖ్యల గురించి విలేకరులు ప్రస్తావించగా ఘాటుగా స్పందించారు. బిగ్ బాస్ వేదికను తమకు అనుకూలంగా మలుచుకోవడంపై ఆమె అసహనం వ్యక్తం చేశారు.
విజయ్ సేతుపతి పరోక్షంగా చేసిన వ్యాఖ్యలపై కనిమొళి సంతోష్ సవాల్ విసిరారు. ఒకరిపై విమర్శలు చేసే ధైర్యం ఉంటే నేరుగా మాట్లాడాలని సవాల్ చేశారు. నిజంగా ధైర్యం ఉంటే ముఖ్యమంత్రి విజయ్ పేరును నేరుగా ప్రస్తావించి మాట్లాడాలని, అప్పుడు తమిళనాడు ప్రజలే విజయ్ సేతుపతికి తగిన రీతిలో సమాధానం చెబుతారని ఆమె స్పష్టం చేశారు. ఇలాంటి ముసుగు వెనుక వ్యాఖ్యలను ప్రజలు ఎప్పటికీ అంగీకరించబోరని పేర్కొన్నారు.
ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో ప్రజలు చాలా చైతన్యవంతులు అయ్యారని, ప్రజాప్రతినిధులు క్షేత్రస్థాయిలో చేస్తోన్న ప్రతి ఒక్క పనిని కూడా నేరుగా గమనిస్తున్నారని కణిమోళి సంతోష్ పేర్కొన్నారు. ప్రజా క్షేత్రంలోకి వెళ్లి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకోవడమే తమ ఏకైక కర్తవ్యమని వివరించారు. ఎప్పుడూ ప్రజల మధ్య ఉండి, వారి సమస్యల పరిష్కారానికి కృషి చేసే వారే నిజమైన నాయకులవుతారని, ఎంటర్టైన్మెంట్ షోలలో లెక్చర్లు ఇచ్చే ప్రసంగాలకు ఇక్కడ స్థానం లేదని ఆమె కొట్టిపారేశారు.













Click it and Unblock the Notifications
