మనసు మార్చుకున్న విజయ్, లేటెస్ట్ సర్వే ఎఫెక్ట్- అనూహ్య నిర్ణయం..!!
తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రెండు కూటములతో తల పడుతున్న విజయ్ అనూహ్య నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఒంటరిగానే పోటీ చేయాలని డిసైడ్ అయిన విజయ్ తాజా వ్యూహాలు ఆసక్తి కరంగా మారాయి. అభ్యర్ధుల ఎంపిక పైన విజయ్ తుది కసరత్తు చేస్తున్నారు. ఎన్నికల బరిలోకి తొలి సారి దిగుతున్న విజయ్ కు పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోంది. దీంతో, తాను పోటీ చేసే సీటు విషయంలో అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. కాగా.. విజయ్ తాజా నిర్ణయాలు ఎన్నికలు సమీపిస్తున్న వేళ కొత్త సమీకరణాలకు కారణమవుతున్నాయి.
తమిళనాడు ఎన్నికల్లో విజయ్ నిర్ణయాలు ఆసక్తి కరంగా మారుతున్నాయి. పొత్తులు.. మేనిఫెస్టో ల పైనా స్పష్టత రావటంతో ఇక.. తాను పోటీ చేసే నియోజకవర్గం పైన నిర్ణయం తీసుకున్నారు. తాజా గా విజయ్ పెరంబూర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు సిద్ధమయ్యారు. వేళచ్చేరి, విరుగంబాక్కం, విరుదాచలం వంటి నియోజకవర్గాల్లో పోటీ చేయాలని ముందుగా భావించినా, చివరికి పెరంబూర్ నుంచి పోటీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.

ఇదిలా ఉండగా నియోజకవర్గంలోనే ఉంటూ ప్రచారం చేపట్టాలని విజయ్ నిర్ణయించారు. అందుకోసం కొడుంగై యూర్ కృష్ణమూర్తి నగర్ జవహర్ వీధిలో ఓ భవనాన్ని విజయ్ కొనుగోలు చేసినట్లు సమాచారం. ఈ బంగ్లాను విజయ్ బసతో పాటు పెరంబూర్ నియోజకవర్గం ఎన్నికల కార్యాలయంగా వినియోగించ నున్నారు. అదే విధంగా అభ్యర్ధుల ఎంపిక ఇప్పుడు విజయ్ కు కొత్త తలనొప్పులు తెచ్చి పెడుతోంది. అయితే, డీఎంకే బలంగా ఉన్న చెన్నై పరిధిలోనే తాను పోటీ చేయటం ద్వారా పార్టీ అభ్యర్ధులకు మేలు జరుగుతుందని విజయ్ భావిస్తున్నారు. ఈసారి తమిళనాట ఎన్నికలు చతుర్ముఖ పోటీగా మారే అవకాశం కనిపిస్తోంది.
సర్వేలతో లెక్క మార్చిన విజయ్
డీఎంకే, అన్నాడీఎంకే కూటములతో పాటు నామ్ తమిళ్ కట్చి (ఎన్‌టీకే), విజయ్ నేతృత్వంలోని టీవీకే కూడా స్వతంత్రంగా పోటీ చేసే సూచనలు ఉన్నాయి. విజయ్ ప్రత్యక్ష రాజకీయాల్లోకి ప్రవేశించడం, ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల సరళిని ప్రభావితం చేయవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. 2021 ఎన్నికల్లో చెన్నై జిల్లాలో డీఎంకే 16 సీట్లను ఏకపక్షంగా గెలుచుకుంది. 1970 నుంచి చెన్నై జిల్లా డీఎంకే కు కంచుకోటగా ఉంది. స్టాలిన్, ఉదయనిధి స్టాలిన్ ఇదే జిల్లా నుంచి బరిలో ఉన్నారు.
చెన్నైలోని 16 నియోజకవర్గాల్లో తమ పార్టీ బలాబలాలను అంచనా వేయడానికి విజయ్ ప్రత్యేక సర్వే చేయించినట్లు తెలుస్తోంది. ఆ సర్వేలో విరుగంబాక్కం, వేళచ్చేరి వంటి ప్రాంతాలు ప్రాధాన్యంగా నిలిచినట్లు సమాచారం. ఈ నియోజకవర్గాల పేర్లు 'వి' అక్షరంతో ప్రారంభమవుతుండటంతో, వాటిలో ఒకదాన్ని ఎంపిక చేసే అవకాశముందనే ప్రచారం కూడా సాగింది. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఈ నియోజక వర్గం నుంచే ఏకంగా 45 వేల మంది చేరినట్లు తెలిసింది. దీంతో అభిమానుల బలం గట్టిగా ఉన్న ప్రాంతంగా భావించి పెరంబూర్‌ను ఎంపిక చేసుకున్నారు.
-
ఎంత సీఎం అయినా.. !! -
Tamil Nadu Polls: సర్వేల షాక్ తో విజయ్ బిగ్ టర్న్..! తుది దశలో తాజా ప్లాన్..! -
విజయ్ కు బిగ్ షాక్.. -
ఎన్నికల వేళ విజయ్ సమర్థతను తేల్చేసిన పవన్..!! -
విజయ్ లీక్డ్ మూవీ చూశా: ఈ టైమ్ లో అది గానీ విడుదలైతే కొంపలు అంటుకుంటాయ్ -
విజయ్ను భయపెట్టిన అభిమాని.. సైకిల్ ఆపి పరుగో పరుగు! వీడియో -
Tamil Nadu polls: చివరి 'బ్రహ్మాస్త్రం' ప్రయోగించిన విజయ్.. ఇక సైకిల్ టూ సీఎం సీటే..! -
విజయ్ పార్టీలో సినిమా చిచ్చు! కీలక పార్టీ మద్దతు ఖతం -
విజయ్ విజిల్ రీసౌండ్- పెరంబూరు, తిరుచ్చి ఈస్ట్ గ్రౌండ్ రిపోర్ట్ -
ఎన్నికల వేళ విజయ్ సంచలనం.. మరో సినిమాకు గ్రీన్ సిగ్నల్..? -
అతిపెద్ద నిర్ణయాన్ని తీసుకోబోతున్నాం- తేల్చి చెప్పిన ప్రధాని మోదీ -
కటౌట్ కు తగ్గ పర్ఫెక్ట్ ఫిల్మ్- టైటిల్ గూస్ బంప్స్: విజువల్ వండర్











Click it and Unblock the Notifications