కోహ్లి-అనుష్కల పెళ్లి: ట్వీట్‌లు చూస్తే మైండ్ బ్లాంక్ కావాల్సిందే
Recommended Video

ఎప్పటినుండో ఊరిస్తున్న విరాట్ కోహ్లి, అనుష్కశర్మల పెళ్లి జరిగిపోయింది. అయితే మాములుగానే కామన్ పీపుల్ గురించి ఏదయినా ఇష్యూ జరిగితేనే నెట్లో ఒక రేంజ్ లో హల్చల్ అవుతుంది. అలాంటిది విరాట్ కోహ్లి అంటే మాటాలా, ప్రపంచానికి పరిచయం అక్కర్లేని పేరు. ఇక అలాంటి కోహ్లి పెళ్లి జరిగింది. అదికూడా బాలీవుడ్ ముద్దుగుమ్మ అనుష్క శర్మతో. ఎప్పటినుండో ప్రేమలో మునిగి తేలుతున్న ఈ లవ్ బర్డ్స్ ఎట్టకేలకు ఒకటయ్యారు. ఇక నెటిజన్లు ఇదే టాపిక్ ని ట్రోల్ చేస్తున్నారు. ఎక్కడ చూసినా వాళ్ళ గురించే, వాళ్ళ పెళ్లి గురించే. ఇక ట్విట్టర్ లో వస్తున్న ట్వీట్ లకు అయితే అడ్డే లేదు. కొంతమంది వాళ్ళను బ్లెస్ చేస్తూ పాజిటివ్ గా పెడుతుంటే మరికొంతమంది మాత్రం వ్యంగ్యంగా ట్వీట్ చేసారు. వాటిలో కొన్నిటిని చూద్దాం !
మొదటిగా మోడీ విరాట్ కోహ్లి, అనుష్కశర్మల కు శుభాకాంక్షలు తెలిపారు. దానికి కోహ్లి థాంక్స్ కూడా చెప్పాడు. ఇక తరువాత మన మోడీ గారు ఏం చెప్పారో తెలుసా ? విరాట్ dec 31 కల్లా మీ మ్యారేజ్ సర్టిఫికేట్ ని ఆదార్ కి లింక్ చెయ్ అని సూచించారు.
ఇక బాలీవుడ్ బాద్షా షారూక్ నిజమైన రబ్ దే బనాతే జోడి మీరే అంటూ ట్వీట్ చేసాడు. బాలీవుడ్ హీరో రితేష్ దేశముఖ్ కూడా ఇక నుండి ఇంట్లో కోహ్లి వైస్ కెప్టెన్ అనుష్క కెప్టెన్ అని ట్వీట్ చేసాడు.
సచిన్ టెండూల్కర్ శుభాకాంక్షలు తెలుపగా కోహ్లి టిప్స్ అడిగాడు. డానికి సచిన్ కోహ్లి ని హెల్మెట్ ధరించమని చెప్పాడు.
ఇక కొంతమంది నెటిజన్లు కూడా తమదైన రీతిలో స్పందించారు. విరాట్ కి పెళ్లి అనేది పెద్ద ఆనందాన్ని ఇవ్వదు. అసలైన ఆనందాన్ని ఇచ్చేది ఎప్పుడో అయిపొయింది అని ఒక నెటిజెన్ ట్వీట్ చేసాడు. ఇక విరాట్ తో పాటు టీం ఇండియా అంతా అనుష్కని ప్రేమిస్తున్నారు అని ఒకతను అన్నాడు. కొంతమంది మ్యారేజ్ అయ్యాక హనీమూన్ ప్లాన్ చేస్తారు. మరికొంతమంది హనీమూన్ తరువాత మ్యారేజ్ ప్లాన్ చేస్తారు. కానీ విరాట్ హనీమూన్ తో పాటు మ్యారేజ్ ని ప్లాన్ చేసాడు. ఎంతైనా లెజెండ్ లెజెండ్ నే అంటూ ఇంకొకతను ట్వీట్ చేసాడు.
-
పెళ్లైన హీరోతో ఎఫైర్ వల్ల సినిమాల్లో బ్యాన్.. ఎవరా డ్రీమ్ గర్ల్ ?? -
అంచనాలను తలకిందులు చేస్తోన్న బంగారం ధరలు -
ఉగాది నుంచి వృషభరాశి, మేషరాశి వారి జాతక ఫలం -
Work From Home ఇచ్చేశారు. ప్రభుత్వం, ఐటీ దిగ్గజాల కీలక ప్రకటన! -
ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!! -
రైతులకు శుభవార్త.. రైతు భరోసాపై కీలక ప్రకటన చేసిన మంత్రి! -
తమిళ నాట అధికారం వారిదే, విజయ్ కు దక్కే సీట్లెన్ని- తేల్చేసిన కేకే సర్వే..!! -
2024 నాటి భీభత్సం మళ్లీ వస్తుంది: ఈ వేసవి చాలా కాలం ఉంటుంది! -
ఉగాది నుంచి మిథున రాశి, కర్కాటక రాశి వారి జాతక ఫలం -
ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్? -
భారత్‌పై అమెరికా దర్యాప్తు. సెక్షన్ 301 ప్రయోగించిన ట్రంప్ -
దేశంలో తొలి `కారుణ్య మరణం`- తీర్పు చెబుతూ కన్నీళ్లు పెట్టిన సుప్రీంకోర్టు ధర్మాసనం












Click it and Unblock the Notifications