అతడొక్కడే.. 12 మంది పిడిగుద్దులు..!
భోపాల్ : చిన్న చిన్న గొడవలు కాస్తా పెద్దవిగా మారుతున్నాయి. కూర్చుండి మాట్లాడుకుంటే సరిపోయేదానికి కొందరు ఘర్షణకు దిగుతున్నారు. అలా రోడ్డు మీదకొచ్చి కొట్టుకుంటున్నారు. ఇటీవల పోలీసులు ఉన్నారనే భయం లేకుండా రోడ్ల మీద కొట్టుకుంటూ, నరుక్కుంటూ బీభత్సం సృష్టించే ఘటనలు నిత్యం ఏదో చోట వెలుగుచూస్తూనే ఉన్నాయి. ఆ క్రమంలో తాజాగా మధ్యప్రదేశ్‌లో జరిగిన ఘటన చర్చానీయాంశంగా మారింది.
మధ్యప్రదేశ్‌లోని ఇటావా దివాస్ ఏరియాలో ఒక్కడిపై పన్నెండు మంది వ్యక్తులు దాడి చేశారు. పిడిగుద్దులు కురిపించారు. అంతమంది ఒకసారే దాడి చేయడంతో అతడు ఎదురు తిరగలేని పరిస్థితి. విచక్షణారహితంగా కొట్టుకుంటూ రోడ్డు మీద ఈడ్చుకెళ్లారు. ఈ ఘటన సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

రాజేంద్ర అనే వ్యక్తిపై ఒక్కరు కాదు ఇద్దరు కాదు ఏకంగా పన్నెండు మంది దాడికి తెగబడ్డారు. అలా కొట్టుకుంటూ రోడ్డు మీద ఈడ్చుకుంటూ అతడికి నరకం చూపించారు. అడ్డొచ్చిన పోలీసులపై కూడా తిరగబడ్డారు. వారిని కూడా లెక్క చేయకుండా నానా మాటలన్నారు. అసభ్య పదజాలంతో దూషిస్తూ రెచ్చిపోయారు. ఎలాగోలా బాధితుడిని రక్షించి వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అతడికి తీవ్ర గాయాలు కావడంతో మెరుగైన వైద్యం అందించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
డబ్బు కారణంగా ఈ గొడవ జరిగినట్లు ఎస్పీ అనిల్ సింగ్ తెలిపారు. బాధితుడిని రక్షించే క్రమంలో దుండగులు పోలీసులను కూడా తిట్టారని చెప్పుకొచ్చారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications