ఊహించని ట్విస్ట్‌తో ఆగిపోయిన పెళ్లి: వరుడు తండ్రి వధువు తల్లి ఏం చేశారంటే..బాబోయ్..!

సూరత్: సాధారణంగా పెళ్లి వేడుక క్లైమాక్స్‌కు వచ్చినప్పుడు ఆపండి అనేది సినిమా కథల్లో చూస్తుంటాం. కానీ నిజజీవితంలో పెళ్లి వేడుక ఇలా విలన్ ఎంట్రీతో ఆగిపోయినవి చాలా అరుదు. అయితే మన కథలో మాత్రం ఎవరూ ఊహించని ట్విస్ట్ ఉంది. గుజరాత్‌లోని సూరత్‌లో ఓ పెళ్లి వేడుక హఠాత్తుగా ఆగిపోయింది. ఇంతకీ ఆ పెళ్లి ఎందుకు ఆగిపోయింది.. ఇందులో ఎవరు విలన్లో తెలుసుకోవాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.

గుజరాత్‌లో రద్దయిన పెళ్లి వేడుక

గుజరాత్‌లో రద్దయిన పెళ్లి వేడుక

గుజరాత్‌లోని సూరత్‌లో పెళ్లి వేడుక జరుగుతోంది. పెళ్లికి అన్ని ఏర్పాట్లు గ్రాండ్‌గా జరుగుతున్నాయి. బంధుమిత్రులందరికీ వెడ్డింగ్ కార్డ్స్ కూడా ఇచ్చేశారు. ఇక పెళ్లికి రెండు వారాల సమయం ఉందనగా పెళ్లి హఠాత్తుగా ఆగిపోయింది. ఈ పెళ్లికి విలన్లు ఎవరో కాదు.. పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి. ఇదేం రచ్చ అనుకుంటున్నారా అవును ఈ పెళ్లి ఆగిపోయేందుకు వారే కారణం. ఇంతకీ ఆ పెళ్లి ఎందుకు ఆగిపోవాల్సి వచ్చిందో అనేగా మీ డౌటు. అక్కడికే వస్తున్నాం. కట్నకానుకల విషయంలోనో లేక పరువు ప్రతిష్ట విషయంలోనో పెళ్లి ఆగిపోలేదు.. మీరు ఊహించని ట్విస్టు వల్ల పెళ్లి ఆగిపోయింది.

ప్రేమలో వరుడు తండ్రి.. వధువు తల్లి

ప్రేమలో వరుడు తండ్రి.. వధువు తల్లి

అసలు విషయం ఏమిటంటే పెళ్లి కొడుకు తండ్రి, పెళ్లి కూతురు తల్లి తాము వయస్సులో ఉండగా ఒకరినొకరు గాఢంగా ప్రేమించుకున్నారట. అప్పుడు ఏవో కారణాల వల్ల ఇద్దరూ దూరమయ్యారు. కానీ వారి పిల్లల పెళ్లి వారిని ఏకం చేస్తుందని ఊహించి ఉండరు. రెండు వారాలు పెళ్లి ఉందనగా ఈ వయస్సులో ఇద్దరూ ప్రేమ పక్షుల్లా ఎగిరిపోయారు. పెళ్లి కొడుకు తండ్రి వయస్సు 48 ఏళ్లు ఉండగా.. పెళ్లి కూతురు తల్లి వయస్సు 46 ఏళ్లు. వీరు ప్రేమలోకంలోకి ప్రవేశించి కూడా 10 రోజులు అవుతోంది. ఇప్పటికీ వీరు ఎక్కడున్నారో జాడ లేదు.

ఇంట్లో నుంచి పారిపోయిన వరుడు తండ్రి, వధువు తల్లి

ఇంట్లో నుంచి పారిపోయిన వరుడు తండ్రి, వధువు తల్లి

వరుడు తండ్రి కటార్గమ్ ప్రాంతంలోని ఇంటి నుంచి పారిపోగా.. వధువు తల్లి నవ్‌సరిలోని తన ఇంటి నుంచి బయటకెళ్లింది. ఇద్దరూ కలిసి పారిపోయి ఉంటారని భావిస్తున్నారు. ఈ విషయం బయటకు పొక్కడంతో ఆ కుటుంబం చాలా ఇబ్బంది పడుతోంది. పరువు తీసేశారని బాధపడుతోంది. రెండు కుటుంబాలు పోలీస్ స్టేషన్లో మిస్సింగ్ కేసును నమోదు చేశాయి. ఇక ఏడాది క్రితమే అమ్మాయికి అబ్బాయికి నిశ్చితార్థం జరిగింది. పెళ్లి తర్వాత ఎలా ఉండాలని కలలు కంటున్న సమయంలో వధువు తల్లి, వరుడి తండ్రి వారి కలలను సాకారం చేసుకున్నారు.

పెళ్లికి ముందే ప్రేమ సంబంధం

పెళ్లికి ముందే ప్రేమ సంబంధం

ఇక వరుడు తండ్రి వధువు తల్లికి చిన్నప్పటి నుంచే స్నేహం ఉండేదట. అయితే వధువు తల్లికి మరొకరితో వివాహమై ఊరు విడిచి నవసర్‌లో నివాసముంటోంది. ఇక వరుడి తండ్రి టైక్స్‌టైల్ వ్యాపారం చేస్తూ బాగానే సంపాదించాడు. అతనికి రాజకీయ పార్టీలతో కూడా సంబంధాలున్నట్లు అతని స్నేహితులు చెబుతున్నారు. అయితే గతంలో కూడా అంటే పెళ్లికి ముందు వీరిద్దరి మధ్య సంబంధం నడిచిందని స్నేహితులు చెబుతున్నారు. అయితే భావ్‌నగర్‌లోని డైమండ్ మర్చంట్‌తో ఈమెకు వివాహం జరిగిందని చెప్పారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+