ప్రీతి కేసులో మరో ట్విస్ట్: లైంగిక వేధింపులు కాదట!
ముంబై: ప్రముఖ పారిశ్రామికవేత్త నెస్ వాడియాపై ప్రముఖ బాలీవుడ్ నటి, ఇండియన్ ప్రీమియర్ లీగ్ జట్టయిన కింగ్స్ లెవన్ పంజాబ్ సహ యజమాని ప్రీతి జింతా లైంగిక వేధింపుల ఆరోపణలు చేయలేదని ఆమె తరపు న్యాయవాది హితేష్ జైన్ పేర్కొన్నారు. బహిరంగ ప్రదేశంలో ప్రీతి జింతాపై నెస్ వాడియా అసభ్య పదజాలం ఉపయోగించి అవమానపర్చాడని ఓ ఆంగ్ల దినపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన వెల్లడించారు.
ప్రీతి జింతా తన ఫిర్యాదులో లైంగికంగా వేధించాడనే ఆరోపణలు ఎక్కవ చేయలేదని, బహిరంగంగా అసభ్యకరంగా దూషించారని ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్నారని న్యాయవాది హితేష్ తెలిపారు. బహిరంగ ప్రదేశంలో అసభ్య పదజాలంతో దూషించడం కారణంగానే అవమానంగా భావించిన ప్రీతి జింతా ముంబైలోని మెరైన్ పోలీస్ స్టేషన్‌లో పిటిషన్ దాఖలు చేశారని తెలిపారు.

ఆమె ఫిర్యాదు మేరకు నెస్ వాడియాపై ఐపిసి 354 సెక్షన్ కింద కేసు నమోదు చేశారని చెప్పారు. ఆ సెక్షన్ కింద నమోదైన కేసు లైంగిక వేధింపుల కిందకు రాదని న్యాయవాది హితేష్ జైన్ పేర్కొన్నారు.
కాగా, అసలు విషయం ఏంటంటే.. ఐపిఎల్-7లో ఓ పంజాబ్ మ్యాచ్ జరుగుతున్న సమయంలో కుటుంబ సభ్యులతో వచ్చిన నెస్ వాడియా.. ప్రీతి జింతా, ఆమె స్నేహితులు, క్రికెటర్ల కుటుంబ సభ్యులు కూర్చున్న సీట్లను ఖాళీ చేయాలని ఆమెను కోరాడు. అయితే అప్పటికే ప్రీతి జింతా తన స్నేహితులతో కూర్చుని ఉండటంతో అందుకు నిరాకరించింది. దీంతో సహనం కోల్పోయిన వాడియాపై ప్రీతిపై పరుష పదజాలంతో దూషించినట్లు తెలిసింది. ఈ విషయాన్ని కన్నీరుపెట్టుకుంటూ ఐపిఎల్ ఛైర్మన్ రంజిబ్ బిస్వాల్‌కు ప్రీతి వివరించినట్లు తెలిసింది.
-
బాలీవుడ్ సూపర్ స్టార్ సరసన సమంత? -
ఉగాది నుంచి వృశ్చిక రాశి, తులారాశి వారి జాతక ఫలం -
T20 World Cup: చిత్తుగా ఓడిన కివీస్ పై అర్ధరాత్రి ఐసీసీ సంచలన ట్వీట్..! -
పాతాళానికి పడిపోతున్న బంగారం ధరలు- భారీ క్రాష్ -
నా దేవత- ఆమె రాకతోనే నా జీవితం ఇలా మారిపోయింది -
ఆయన చలవ వల్లే- సక్సెస్ మంత్ర బయటపెట్టిన సంజు -
రిటైర్మెంట్ పై సూర్య కుమార్ సంచలన ప్రకటన..!! -
రోహిత్‌కు పెళ్లాం పోరు.. స్టేడియంలో డిష్యూం.. డిష్యూం! వీడియో -
ప్రపంచ్ కప్ తో సూర్య టీం ముందుగా అక్కడికే, వెంట పెట్టుకొని వెళ్లిన జైషా..!! -
Viral Video: ఆ తొలి స్పర్శ, బిడ్డను ఎత్తుకోవడానికి వణికిపోయాడు -
ఇంత నిలకడ మా పోర్ట్‌లోని క్రేన్‌కు కూడా ఉండదు- సంజు శాంసన్ పై ప్రశంసలు -
11 రోజుల్లో 13,560 కి.మీ నాన్ స్టాప్ జర్నీ: చిరు ప్రాణి రెక్కల ముందు సప్త మహా సముద్రాలు చిన్నబోయాయ్












Click it and Unblock the Notifications