షీనా బోరా హత్య: సినిమా స్టోరీని తలదన్నే సస్పెన్షు
ముంబై: షీనా బోరా హత్య కేసులో సినిమా స్టోరీని తలదన్నే ట్విస్టులున్నాయి. కన్న కూతురిని మట్టుబెట్టి గుట్టుగా వ్యవహరిస్తున్న ఇంద్రాణి ముఖార్జీయా చివరకు పోలీసులకు చిక్కి, వాస్తవాలు అంగీకరించాల్సిన పరిస్థితిలో పడ్డారు. స్టార్ ఇండియా మాజీ సిఈఓ పీటర్ ముఖర్జీ భార్య ఇంద్రాణి ముఖార్జియాను పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.
తన కూతురును సోదరిగా పరిచయం చేసిన ఇంద్రాణి భర్త పీటర్ ముఖార్జియాకు ఏ రోజూ కూడా నిజం చెప్పలేదు. ఆమె అరెస్టయిన తర్వాత గానీ పీటర్‌కు అసలు విషయం తెలియలేదు. అది తెలిసిన తర్వాత అవాక్కు కావడం ఆయన వంతైంది. పీటర్‌తో వివాహానికి ముందే తనకు పిల్లలున్నారని చెప్పేందుకు ఇంద్రాణి బహుశా సందేహించి ఉంటుంది.
పీటర్‌తో ఇంద్రాణి వివాహానికి ముందే ఆయనకు మరో భార్య ద్వారా పుట్టిన కుమారుడు షీనాతో ప్రేమలో పడ్డాడు. అంటే తాను ప్రేమలో పడింది తన సోదరి వరుసైన అమ్మాయితో అని పీటర్ కుమారుడికి తెలియదు. వీరిద్దరి సంబంధం గురించి తెలిసిన తర్వాత ఇంద్రాణి అసలుకే మోసం వస్తుందని గ్రహించి కూతురును అత్యంత చాకచక్యంగా మట్టుబెట్టింది.

తన డ్రైవర్‌ను ఈ పనికి పురమాయించింది. 2012లో షీనాను చంపేశాక ఆమె మృత దేహాన్ని రాయ్‌గఢ్ అటవీ ప్రాంతంలో పూడ్చేశారు. ఆ తర్వాత ఇంద్రాణి ఏమీ తెలియనట్లు నటించడం ప్రారంభించారు. షీనా గురించి పీటర్ కుమారుడు అడిగినప్పుడల్లా అమెరికాలో ఉందని ఇంద్రాణి చెబుతూ వచ్చారు చివరకు ముంబై పోలీసులు తొలుత ఇంద్రాణి డ్రైవర్‌ను అరెస్ట్ చేశారు. అతడిచ్చిన వివరాల ఆధారంగా ఇంద్రాణి ముఖార్జియాను కూడా అరెస్ట్ చేశారు.
ముంబై పోలీస్ కమిషనర్ రాకేశ్ మారియా ఇంటరాగేషన్‌లో షీనా తన కుమార్తె అని, సోదరి కాదని ఇంద్రాణి ఒప్పుకున్నారు. హత్యకు కుట్ర పన్నిన విషయాన్ని కూడా అంగీకరించారని సమాచారం. తీవ్ర దిగ్భ్రాంతికి గురైన పీటర్ ముఖార్జియా తన ఆవేదనను ఓ టీవీ చానెల్‌తో పంచుకున్నారు.












Click it and Unblock the Notifications