మాల్యా ట్విట్టర్ హ్యాక్: బ్యాంక్ ఖాతా పాస్‌వర్డ్‌లు బయటపెడ్తామంటూ..
లండన్/న్యూఢిల్లీ: స్వదేశంలో రూ. 9వేల కోట్ల బ్యాంకు రుణాలను ఎగ్గొట్టి విదేశాల్లో తలదాచుకున్న ప్రముఖ లిక్కర్ వ్యాపారవేత్త విజయ్ మాల్యా అధికారిక ట్విట్టర్ ఖాతా హ్యాకయింది. అంతేగాక అతని ఈ మెయిల్స్ కూడా హ్యాక్ చేశారు దుండగులు.
'హల్లో.. మేము మాల్యాకి వివిధ బ్యాంకుల్లో ఉన్న ఖాతాల పాస్‌వర్డ్‌లను తెలుసుకుని మళ్లీ వచ్చేశాం' అంటూ హ్యాకర్లు మాల్యా ఖాతాలో ట్వీట్ చేశారు. వివిధ బ్యాంకుల్లో మాల్యాకున్న ఆస్తులు, ఆయన లావాదేవీలకు సంబంధించిన పాస్‌వర్డులు తమకు తెలుసని పేర్కొన్నారు.

అంతేగాక, 'ఈ అవినీతిపరుడికి సంబంధించిన పలు పత్రాలను కొన్ని వారాల్లో మీముందుకు తీసుకొస్తాం.. చూస్తూ ఉండండి' అని ట్వీట్ చేశారు. మాల్యాని తాము బ్లాక్‌మెయిల్ చేయలేదని, ఆ విధంగా అతను చేస్తున్న ప్రచారం, ఆరోపణలన్నీ అవాస్తవాలేనని హ్యాకింగ్‌కు పాల్పడిన 'లిజియన్' పేర్కొంది.
Outfit called Legion has hacked my e-mail accounts and are blackmailing me !! What a joke.
— Vijay Mallya (@TheVijayMallya) 8 December 2016
మాల్యాకి సంబంధించి వివిధ అంశాలపై జరుగుతున్న విచారణ పూర్తవగానే మాల్యాకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లు, విదేశాల్లో ఉన్న ఆస్తులకు సంబంధించి మరిన్ని వివరాలు వెల్లడిస్తామని ట్వీట్ చేసింది.
Outfit called Legion has hacked my e-mail accounts and are blackmailing me !! What a joke.
— Vijay Mallya (@TheVijayMallya) 8 December 2016
కాగా, హ్యాకింగ్ విషయంపై విజయ్ మాల్యా సరదాగా స్పందించారు. 'నా ఈ మెయిల్ అకౌంట్ హ్యాక్ చేశారట. లిజియన్ ఈ మేరకు నన్ను బ్లాక్ మెయిల్ చేస్తోంది. వాట్ ఏ జోక్' అంటూ ట్విట్టర్ వేదికగా వ్యాఖ్యానించారు. అంతేగాక, 'నా ఖాతా వివరాలు, ఆర్థిక వ్యవహారాలు కూడా వెల్లడిస్తామంటున్నారు' అంటే ఆయన పేర్కొన్నారు.
-
Tamil Nadu Survey: తమిళనాడులో మారిపోయిన లెక్కలు-తాజా సర్వేలో ఓటర్ల షాక్..! -
ఇందిరమ్మ లబ్దిదారులకు గుడ్ న్యూస్.. రెండో విడత ఇళ్లపై కీలక ప్రకటన -
ఈ సారి 'తల్లికి వందనం' అమలు అప్పుడే - చంద్రబాబు కీలక ప్రకటన..!! -
బంగారం ధరలకు గత వైభవం -
మెగా డాటర్ మళ్లీ హిట్ కొట్టేసిందయ్యో.. సంగీత్ శోభన్ "రాకాస" రివ్యూ ! -
వంట గ్యాస్ బుక్ చేసినా రావటం లేదా, అసలు సమస్య - ఇలా చేయండి..!! -
Vijay: ఎంజీఆర్, జయలలిత చేయని సాహసం చేస్తున్న విజయ్? డీఎంకే కంచుకోటలో..! -
చర్లపల్లి నుంచి తెలుగు రాష్ట్రాల మీదుగా ఇక ఈ రైళ్లు ..! -
INS Aridhaman: ప్రళయ కాల రుద్రుడు, నీటి అడుగున భారత్ విశ్వరూపం.. -
బీఆర్ఎస్ లో చేరిక పై తేల్చేసిన జీవన్ రెడ్డి, వాట్ నెక్స్ట్..!! -
ఉద్యోగులకు కూటమి ప్రభుత్వం భారీ గుడ్‌న్యూస్ -
CBSE Exam 2026: 12వ తరగతి ఎగ్జామ్ పేపర్ క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే షాక్..!!












Click it and Unblock the Notifications