వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాట్సప్‌తో పరిచయం, కారులో రేప్: నిందితుల అరెస్ట్

|
Google Oneindia TeluguNews

Two arrested for raping 21-yr-old in moving car
జైపూర్: 21ఏళ్ల యువతిపై కదులుతున్న కారులో అత్యాచారానికి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించారు. దౌస ప్రాంతంలో ప్రధాన నిందితుడితోపాటు ఇద్దరు నిందితులను గాంధీనగర్ పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. బాధితురాలు నిందితుడు దినేష్ శర్మ(43)కు వాట్సప్ ద్వారా పరిచయమైంది.

నిందితుడు ఉద్యోగం కోసం వెతికే అమ్మాయిలకు మాత్రమే తన నెంబర్ ఇస్తాడని పోలీసులు చెప్పారు. ఈ నేపథ్యంలో బాధితురాలు శర్మను సంప్రదించగా అతడు ఆమెను జైపూర్‌లోని బిర్లా ఆలయం వద్దకు రావాలని కోరాడు. ఆ తర్వాత ఆమెను తన కారులో ఎక్కించుకుని ఆదర్శ్‌నగర్, రాజాపార్క్ మీదుగా తిప్పుతూ ఆమెపై అత్యాచారానికి పాల్పడ్డాడు.

బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు, నిందితుడు దినేష్ శర్మతోపాటు కారు నడిపిన హరికిషన్ అనే వ్యక్తిని కూడా అదుపులోకి తీసుకున్నారు. బాధితురాలు ఇచ్చిన నిందితుడి ఫోన్ నెంబర్‌ను ట్రాక్ చేసి, దౌస సమీపంలో నిందితులను పట్టుకున్నామని పోలీసులు చెప్పారు.

కాగా, బాధితురాలు తనకు వాట్సప్ ద్వారా పరిచయం కాలేదని, అంతకుముందు నుంచే పరిచయం ఉందని నిందితుడు పోలీసులు చెప్పాడు. వ్యక్తిగతంగా తనకు బాధితురాలు చాలా కాలం నుంచి తెలుసని నిందితుడు తెలిపాడని ఓ సీనియర్ పోలీసు అధికారి చెప్పారు.

గురువారం బాధితురాలి నుంచి ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు, నిందితుడిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. బుధవారం రాత్రి 8 గంటల నుంచి 9గంటల మధ్యలో తనపై కదులుతున్న కారులో అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు నిందితుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది.

English summary
A day after a 21-year-old woman registered a complaint against a man accusing of raping her in a moving car, the Gandhi Nagar police has nailed down the culprit. Police have arrested two persons from Dausa, including the main accused and his accomplice, for the crime.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X