లిఫ్ట్ లో లైంగిక దాడి: బీ టెక్ స్టూడెంట్స్ అరెస్టు

చెన్నై: లిఫ్ట్ లో యువతి మీద ఇద్దరు కామాంధులు అత్యాచారం చెయ్యడానికి విఫలయత్నం చేసిన సంఘటన చెన్నై నగర శివార్లలో జరిగింది. అత్యాచారయత్నం చెయ్యడానికి ప్రయత్నించిన ఇద్దరు విద్యార్థులను చితకబాదిన స్థానికులు పోలీసులకు అప్పగించారు.

చెన్నై సమీపంలోని వండలూరు దగ్గర ఉన్న పోథరిలోని అపార్ట్ మెంట్ లో నివాసం ఉంటున్న బీహార్ కు చెందిన శరత్ కుమార్ (21), చందన్ కుమార్ (20) అనే ఇద్దరిని అరెస్టు చేశారు. వీరిద్దరు వండలూరు చేరుకుని ప్రయివేట్ కాలేజ్ లో బీ టెక్ విద్యాభ్యాసం చేస్తున్నారు.

వీరు నివాసం ఉంటున్న అపార్ట్ మెంట్ ఐదవ అంతస్తులో మధ్యప్రదేశ్ కు చెందిన ఇషా (21) అనే యువతి నివాసం ఉంటున్నది. ఈమె ప్రయివేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నది. ఇటివల శరత్ కుమార్, చందన్ కుమార్ అపార్ట్ మెంట్ కింద ఉన్నారు.

Two B tech students arrested after sexually assaulting in Chennai

ఇషా ఉద్యోగం ముగించుకుని అపార్ట్ మెంట్ దగ్గరకు వెళ్లింది. ఆమె లిఫ్ట్ లో వెళుతుందని గుర్తించిన ఇద్దరు ముందుగా లిఫ్ట్ లోకి వెళ్లారు. వారిద్దరు లిఫ్ట్ లో ఉన్న విషయం గుర్తించి ఇషా బయటే నిలబడి పోయింది. అయితే ఒకరు ఆమెను లిఫ్ట్ లోకి లాక్కున్నారు.

తరువాత లిఫ్ట్ క్లోజ్ చేశారు. కిందకు పైకి లిఫ్ట్ పోనిస్తూ ఆమె మీద అత్యాచారయత్నం చెయ్యడానికి ప్రయత్నించారు. లిఫ్ట్ ఐదవ ఫ్లోర్ లోకి వెళ్లిన సమయంలో ఇషా గట్టిగా కేకలు వేసింది. ఐదవ అంతస్తులో నివాసం ఉంటున్న వారు లిఫ్ట్ స్విచ్ ఆన్ చేశారు.

అయితే నిందితులు మళ్లీ లిఫ్ట్ క్లోజ్ చేసి గ్రౌండ్ ఫ్లోర్ లోకి వెళ్లారు. యువతిని లిఫ్ట్ లో వదిలి అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించారు. అయితే స్థానికులు వెంటాడి ఇద్దరిని పట్టుకుని చితకబాది పోలీసులకు అప్పగించారు.

బాధితురాలు, స్థానికుల ఫిర్యాదు మేరకు నిందితులు ఇద్దరి మీద పలు సెక్షన్ ల కింద కేసులు నమోదు చేసి జైలుకు పంపించామని పోలీసు అధికారులు తెలిపారు. వీరిద్దరిని కాలేజ్ నుంచి సస్పెండ్ చేస్తు అధికారులు ఆదేశాలు జారీ చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+