• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

రెండు అరటి పండ్లకు రూ.442 బిల్లు ఎలా వేశారు: మారియట్‌కు నోటీసులు

|

చండీగఢ్ : రెండు అరటిపళ్లపై రూ. 442.50 బిల్లు విధించడంపై వివరణ ఇవ్వాలంటూ అసలు అంత మొత్తం బిల్లును ఏ ప్రాతిపదికన వేశారని ప్రముఖ ఫైవ్ స్టార్ హోటల్‌ జే డబ్ల్యూ మారియట్‌ను వివరణ కోరింది ఎక్సైస్ అండ్ టాక్సేషన్ డిపార్ట్‌మెంట్. ఈ మేరకు హోటల్‌కు షో కాజ్ నోటీసులు పంపింది. కొద్ది రోజుల క్రితం ఆ హోటల్‌కు వెళ్లిన ప్రముఖ బాలీవుడ్ నటులు రాహుల్ బోస్ రెండు తాజా అరటి పళ్లను ఆర్డర్ చేశాడు. అయితే బిల్లు చూసిన అతను ఒక్కసారిగా షాక్‌కు గురయ్యాడు. రెండు అరటి పండ్లకు రూ.442. 50 రూపాయలా అంటూ ఆశ్చర్యపోయిన రాహుల్ బోస్ బిల్లును ఫోటో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. పోస్టు చేసిన కొద్ది నిమిషాలకే ఈ విషయం వైరల్ అయ్యింది.

సాధారణంగా తాజా అరటిపండ్లపై ఎలాంటి ట్యాక్స్ లేనప్పుడు ట్యాక్స్ ఎందుకు విధించారో చెప్పాలంటూ హోటల్ యాజమాన్యాన్ని వివరణ కోరింది ఆదాయపు పన్ను శాఖ. తాజా పండ్లు పన్ను పరిమితిలోకి రావని అసిస్టెంట్ ఎక్స్‌సైజ్ మరియు టాక్సేషన్ కమిషనర్ రాజీవ్ చౌదరి చెప్పారు. ఏ ప్రాతిపదికన బిల్లువేశారో వివరణ ఇవ్వాల్సిందిగా చండీగడ్‌లోని హోటల్‌ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇచ్చినట్లు తెలిపారు. ఇక రాహుల్ బోస్ సోషల్ మీడియాలో జరిగిన తంతును పోస్టు చేయగానే చండీగఢ్ డిప్యూటీ కమిషనర్ మరియు ఎక్సైస్ టాక్సేషన్ కమిషనర్ మన్‌దీప్ సింగ్ బ్రార్ విచారణకు ఆదేశించారు.

Two banana @442 row:Show cause notice issued to JW Marriot Hotel asking for explanation

ముగ్గురు సభ్యులతో కూడిన విచారణ టీమ్‌ను ఏర్పాటు చేశారు. దీంతో వివరణ ఇవ్వాల్సిందిగా ఈ టీమ్ హోటల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు ఇచ్చింది. శనివారంలోగా వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొంది. ఒక నిర్ణయంకు రాక మునుపే వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలంటూ నోటీసులో పేర్కొన్నట్లు విచారణాధికారులు తెలిపారు. ఈ విచారణ ఒక న్యాయవాది ముందు జరుగుతుందని తెలిపారు. ఇదిలా ఉంటే ఇప్పటి వరకు హోటల్ యాజమాన్యం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు.

ఇదిలా ఉంటే.. హోటల్ యాజమాన్యం ప్రభుత్వానికి పన్ను సక్రమంగా కడుతోందా లేదా అనేదానిపై కూడా ఆరా తీస్తున్నారు అధికారులు. ఒకవేళ తప్పు చేసినట్లుగా తమ విచారణలో తేలితే హాటల్‌కు భారీ జరిమానా విధించే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

English summary
Excise and taxation department had sent a show cause notice to JW Marriot hotel which charged an amount of Rs. 442.50 for two fresh bananas. Actor Rahul bose who posted the bill on social media went viral after which the officials demanded for an explanation.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more