Sex Racket: ఇద్దరు నటీల అరెస్ట్.. వారు వ్యభిచార కూపంలో దిగారీలా..?
బాలీవుడ్ రంగుల ప్రపంచంలో... చీకటి రంగులు కూడా ఉంటాయి. ఆ రంగుల్లో సెక్స్ రాకెట్ ఒకటి. ముంబైకి కాస్త దూరంలో భారీ సెక్స్ రాకెట్ బయటపడింది. క్రైమ్ బ్రాంచ్ యూనిట్ రంగంలోకి దిగి... ఐదుగురిని అరెస్టు చేసింది. వారిలో ఇద్దరు బాలీవుడ్ నటీమణులు ఉన్నారు. సిటీ శివార్లలో 5 ఎకరాల ఏరియాలో ఏదో జరుగుతుందని.. స్థానికులు అనుమానించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. షూటింగ్ అనుకున్నారు.. కానీ రైడ్ చేస్తే గానీ తెలియలేదు.. అదీ సెక్స్ రాకెట్ అని.

లోన అమ్మాయిలు.. వ్యభిచారం...
క్రైమ్ బ్రాంచ్ అలర్ట్ అయ్యింది. రైడ్ చేయగా సెక్స్ రాకెట్ సీక్రెట్ రివీల్ అయ్యింది. ప్రైవేట్ సొసైటీలో గల ఓ ఫ్లాట్‌లో సెక్స్ రాకెట్ నడుస్తోందని ప్రథానా క్రైమ్ బ్రాంచ్ పోలీసులు తెలిపారు. ఆ ఇద్దరు అమ్మాయిలూ... అందంగానే ఉన్నా... సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. ఖర్చులేమో పెరిగాయి. లాక్‌డౌన్‌లో అప్పులు చేశారు. ఇబ్బందులు పెరిగాయి. ఏం చెయ్యాలో అర్థం కాలేదు. ఆ టైమ్‌లో ఎవరో చెప్పగా... కష్టాల నుంచి బయటపడేందుకు వేరే మార్గం లేక... ఈ వ్యబిచార వృత్తిలోకి వెళ్లామని ఆ అమ్మాయిలు చెప్పారు.

పెద్ద నటులు ఓకే.. మరీ చిన్నవారి సంగతి
కరోనా వచ్చాక... మహారాష్ట్ర తీవ్రంగా దెబ్బతింది. బాలీవుడ్ మూతపడింది. పెద్ద నటులు నెట్టుకు రాగలిగారు కానీ... చిన్న నటుల బాధ మాములుగా లేదు. చేయడానికి వారికి నటన తప్ప వేరే పనులేవీ రావు. అబ్బాయిలైతే... ఏ కూరగాయలో అమ్ముకుంటూ... సెటిల్ అయ్యారు గానీ... అమ్మాయిలకు తలనొప్పులు తప్పలేదు. అందువల్ల చాలా మంది ఇలాంటివి చేస్తూ ఉండొచ్చనే అనుమానాలు కలుగుతున్నాయి. ఆ ఇద్దరు అమ్మాయిలనూ ఈ ఉచ్చులోకి దింపిన అసలు ఏజెంట్ ఫోన్ స్విచ్ఛాఫ్ అయి ఉంది. అతన్ని పట్టుకుంటే... మొత్తం డొంక కదులుతుందని పోలీసులు చెబుతున్నారు.

ఒక రాత్రికి రూ.2 లక్షలు
సెక్స్ రాకెట్ చాలా హైటెక్ రేంజ్‌కు చెందినది. అమ్మాయిలతో డీల్ కుదిర్చే వారు... కస్టమర్లతో ముందుగా మాట్లాడి... అమ్మాయిల వీడియోలు, ఫొటోలూ చూపిస్తారు. ఆ తర్వాత ఒక రాత్రికి రూ.2 లక్షలు అడుగుతున్నారు. అరెస్టు సమయంలో... రూ.1.80 లక్షల చొప్పున ఇద్దరు అమ్మాయిలకు డబ్బు వసూలు చేసినట్లు తెలిసింది. పోలీసులు ఆ డబ్బును సీజ్ చేశారు. ఇలా నిత్రాజ్ సొసైటీలో జరుగుతున్న తంతు స్థానికంగా కలకలం రేపింది. అరెస్టు చేసిన వారిలో ఇద్దరు అమ్మాయిలతోపాటూ... ఇద్దరు మహిళా ఏజెంట్లు, ఓ బ్రోకర్ ఉన్నట్లు తెలిసింది. విటులను వదిలేశారా అనే అనుమానం కలుగుతోంది.

మరికొందరు..
సొసైటీ తంతుకి సంబంధించి మరికొందరు సభ్యులు ఉన్నారనీ... వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని పోలీసులు తెలిపారు. సైడ్ రోల్స్ చేసే ఈ ఇద్దరు అమ్మాయిలు.. ఎప్పటి నుంచి ఈ వృత్తిలోకి దిగారు... వీళ్లతో ఇంకా ఎంత మంది అమ్మాయిలు జత కట్టారు. వంటివి వివరాలు త్వరలో మీడియాకు చెబుతామని పోలీసులు తెలిపారు.
-
ఈ రాత్రికి ఆయనొక్క మాట చెబితే చాలు.. బంగారం తలకిందులే! -
కుంభరాశి వారికి ఉగాది నుండి జరిగేదిదే! -
ఇరాన్ వార్ నుంచి తప్పుకుంటాం కానీ..! ఎదురుదెబ్పల వేళ ట్రంప్ సంకేతం..! -
60 ఏళ్ల క్రితం ఏం జరిగింది? పరాభవ నామ సంవత్సరం.. పేరులోనే కీడు? -
ఉత్తరాభాద్ర నక్షత్రంలో శని సంచారం: కుంభరాశితో పాటు వీరికి సకల సంపదలు! -
తీవ్ర సంక్షోభంలో పాకిస్తాన్- ప్రధాని షరీఫ్ అనూహ్య ఆదేశాలు -
హార్మూజ్ జలసంధిని అమెరికా టచ్ చేయలేదు.. కారణం ఇదే..? -
రైతులకు భారీ గుడ్ న్యూస్, పరిమితి రూ 5 లక్షలకు పెంపు - విధి విధానాలు..!! -
ఫస్ట్ ఒక స్టోరీ చెప్పి షూటింగ్‌కి వెళ్లాక దుస్తులు తీసేయాలన్నారు..! -
today rashiphalalu:శుక్రుడు, శని కుంభరాశిలో.. వీరికి జాక్ పాట్! -
తప్పులో కాలేసిన విజయ్: ఏకంగా తలైవాతో..: కాలం మాట్లాడదు, వేచి ఉండి బదులిస్తుంది -
Tenth Exams: కన్నీళ్లు తెప్పిస్తున్న దృశ్యం. ఆక్సిజన్ సాయంతో పరీక్ష రాసిన విద్యార్ధి












Click it and Unblock the Notifications