ఢిల్లీలో ఫైరింగ్, మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్‌పై పోలీసుల కాల్పులు, ఇద్దరు హతం

మోస్ట్ వాంటెడ్ క్రిమిన్సల్‌ను ఢిల్లీ పోలీసులు మట్టుబెట్టారు. ప్రహ్లాద్‌పూర్ వద్ద రాజా ఖురేషీ, రమేశ్ బహదూర్ ఉన్నారనే సమాచారంతో స్పెషల్ సెల్ పోలీసులు అక్కడికి చేరుకొన్నారు. అయితే పోలీసులను చూసిన దుండగులు కాల్పులు ప్రారంభించారు. వారిని లొంగిపోవాలని పోలీసులు కోరినా వినిపించుకోలేదు. దీంతో చేసేదేమీ లేక పోలీసులు కూడా కాల్పులు జరిపారు.

బహదూర్‌పూర్ సమీపంలో గల ప్రహ్లాద్‌పూర్ వద్ద ఉన్నారనే సమాచారంతో పోలీసులు చేరుకున్నారు. ఉదయం 5 గంటలకు చీకటిలో వారిని పోలీసులు గుర్తించారు. లొంగిపోవాలని కోరారు. కానీ దుండగులు కాల్పులు జరపడంతో పోలీసులు ఫైరింగ్ స్టార్ట్ చేయాల్సి వచ్చింది. ఇరు వర్గాల మధ్య 30 రౌండ్ల కాల్పులు జరిగాయి. కాల్పుల తర్వాత నెలకొరగడంతో పోలీసులు వారిని సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు చనిపోయారని వైద్యులు పేర్కొన్నారు.

Two criminals killed in encounter in Delhi Prahladpur area

ఇద్దరిపై పలు అభియోగాలు ఉన్నాయని ఢిల్లీ పోలీసులు చెప్తున్నారు. ఇటీవల కారావలి నగర్ హత్య కేసులోనూ వీరు నిందితులు అని పోలీసులు పేర్కొన్నారు. మరోవైపు గతేడాది అక్టోబర్‌లో కూడా ఎన్ కౌంటర్ జరిగింది. రోహిణి ప్రాంతంలో స్పెషల్ సెల్ పోలీసులు కూడా కాల్పులు జరిపారు. క్రిమినల్స్ ఉన్నారనే సమాచారంతో పట్టుకొనేందుకు రాగా.. వారు ఫైర్ స్టార్ట్ చేశారు. పోలీసుల కాల్పుల్లో దుండగులు గాయపడ్డారు. వారు దొంగిలించిన నగదును స్వాధీనం చేసుకున్నామని అప్పట్లో పోలీసులు వెల్లడించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+